ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్
తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలైంది. ఈసారి కంటెస్టెంట్స్ తీరుతో జడ్జెస్ బిత్తరపోవడమే కాదు. షాకవ్వడం, సర్‌ప్రైజ్ అవ్వడమూ జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే మినిమం డిగ్రీ చదవాలనే డైలాగ్‌తో పాపులర్ అయిన మన్మధరాజా కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఎందుకంటారా? తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి!
ఇక అసలు విషయంలోకి వెళితే.. బిగ్ బాస్‌లో ఛాన్స్ కావాలంటూ ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశాడు ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా. అంతకు ముందు థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమం డిగ్రీ ఉండాలి… అనే డైలాగ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడితను. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలో తనకు తెలీదంటూ ఏకంగా.. అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్షకు దిగాడు. ఈ రకంగానైనా.. తన గురించి నాగార్జునకి తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. ఇక అతను కోరుకున్నట్లు గానే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో రామాచారికి ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేశాడు రామాచారి. శ్రీముఖి కాళ్లపై పడి బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత తన కష్టాలన్న జడ్జీల ముందు ఏకరువు పెట్టాడు. తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని.. అమ్మా నాన్న లేరని, తనకు ఎలాంటి ఆస్తులూ లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి పెళ్లి చేసేవాళ్లు కూడా లేరని సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జీలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా? లేక మేమంతా కలిసి నీకు పెళ్లి చేయాలనా? అంటూ నవదీప్, బిందుమాధవి మన్మధరాజాపై సెటైర్లు వేశారు. తన ట్యాలెంట్ చెప్పుకునే ఛాన్స్ ఇచ్చినా.. అది తప్ప ఏదోదో మాట్లాడుతూ ఏడుస్తున్న చారి తీరుతో చిరాకుపడిన జడ్డిలు ‘మీరు బిగ్ బాస్‌కు సూట్ అవ్వరు బాస్’ అంటూ రెడ్ ఫ్లాగ్ చూపించారు. దీనితో అతను ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ
ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ
ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!
చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్ !
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

