Lavanya Tripathi – Varun Tej Love Story: 7 ఏళ్ల ప్రేమ.. 7 అడుగుల దాకా.. వీళ్ల లవ్ స్టోరీ ? సూపర్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... గ్లామర్ డాల్ లావణ్య త్రిపాఠి! మూడు ముళ్ల అంకానికి చిన్న టీజర్ లా వీళ్ల ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. ప్రేమ పరిణయంగా మారే దశ మొదలైంది. బంధం తో పాటు ఒకరిపై మరొకరికి బాధ్యత కూడా పెరిగిపోయింది. ఏడడుగులు వేసే ముందు.. ఏడేళ్లు కలిసి మెలిసి ప్రేమించుకుంటూ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్… గ్లామర్ డాల్ లావణ్య త్రిపాఠి! మూడు ముళ్ల అంకానికి చిన్న టీజర్ లా వీళ్ల ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. ప్రేమ పరిణయంగా మారే దశ మొదలైంది. బంధం తో పాటు ఒకరిపై మరొకరికి బాధ్యత కూడా పెరిగిపోయింది. ఏడడుగులు వేసే ముందు.. ఏడేళ్లు కలిసి మెలిసి ప్రేమించుకుంటూ ఉన్న వీళ్ల ప్రేమ కథ ఇప్పుడు అందరి నోట చర్చనీయాంశమవుతోంది. ఎస్ ! మెగా స్టార్ చిరుకు ఇష్టమైన చిన్నోడిగా… నాగబాబు కొడుకుగా.. సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. ముకుంద సినిమాతో హీరోగా మారారు. మెగాప్రిన్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. అప్పటికే అందాల రాక్షసి సినిమాతో.. క్రేజీ బ్యూటీగా నామ్ కమాయించిన లావణ్య త్రిపాఠితో.. వరుణ్.. మిస్టర్ సినిమా చేశారు. అక్కడే అప్పటి నుంచే.. వీరిద్దరూ ఒకరితో మరొకరు ప్రేమలో పడిపోయారు. ఇదే విషయాన్ని తన ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ… 2016లోనే తన చిరకాల ప్రేమను కనుగొన్నా అంటూ.. లావణ్య రాసుకొచ్చారు. ఇలా వీరిద్దరూ 2016 మిస్టర్ షూటింగ్ టైంలోనే…ప్రేమలో పడి.. ఆ తరువాత గప్ చుప్‌గా తమ రిలేషన్‌ను మెయిన్ టేన్ చేస్తూ… వచ్చారు. ప్రేమ గీమా.. డేటింగ్ గీటింగ్ వంటి ఎన్ని రూమర్స్ వచ్చినా తమది కాదన్నట్టు.. తమకు పట్టనట్టే బిహేవ్ చేశారు. అందరికీ ట్విస్ట్ ఇస్తూ.. తాజాగా ఇలా ఒక్కటయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!