Garlic For Health: ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
చాలా మంది కడుపులో గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కడుపులోని గ్యాస్ అనేక విధాలుగా చికాకుపెడుతుంది. అలాంటి వారికి పచ్చి వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
చాలా మంది కడుపులో గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కడుపులోని గ్యాస్ అనేక విధాలుగా చికాకుపెడుతుంది. అలాంటి వారికి పచ్చి వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది. వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే వీటిని నమలడం అలవాటు చేసుకుంటే.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మంచి జీర్ణవ్యవస్థకు పచ్చి వెల్లుల్లి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడం ద్వారా ప్రేగుల కదలికను సులభతరం చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
పచ్చి వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ b6, సెలీనియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. వెల్లుల్లి రెబ్బను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జలుబు బారిన పడడం తగ్గుతుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినేవారు అతి తక్కువగా ఔషధాలు తీసుకుంటున్నట్టు ఓ అద్యయనంలో తేలింది. వారికి 63శాతం వరకు జలుబు, ఫ్లూ వంటి రోగాలు వచ్చే ఛాన్స్ తగ్గినట్టు గుర్తించారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.