Curry Leaves: పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా..? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.!

ప్రస్తుత కాలంలో కారణాలేమైనా చాలా మంది ఉబకాయం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. దీని వల్ల అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

Curry Leaves: పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా..? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.!

|

Updated on: Jun 27, 2024 | 7:07 PM

ప్రస్తుత కాలంలో కారణాలేమైనా చాలా మంది ఉబకాయం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. దీని వల్ల అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇందుకోసం మన వంటింట్లో ఉండే సహాజ పదార్థాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కూరలోంచి ఈజీగా తీసి పడేసే కరివేపాకు అధిక బరువు సమస్యను పరిష్కరిస్తుందని మీకు తెలుసా..?

కరివేపాకు వంటలో రుచిని పెంచుతుంది. అంతే కాదు శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాటిలో చాలా ముఖ్యమైనది ఊబకాయం. ఊబకాయాన్ని తగ్గించడంలో కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఇనుము, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. చాలా వరకు కొవ్వు పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోతుంది. ఇలాంటప్పుడు కరివేపాకును తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది లిపిడ్లు, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కరివేపాకు రసం చేయడానికి, ముందుగా కరివేపాకులను కడిగి నీటిలో ఉడకబెట్టాలి. కొంత సమయం తరువాత, ఈ నీటిని ఫిల్టర్ సహాయంతో వడపోసి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మరొక పద్ధతి ప్రకారం, దీని ఆకులను చూర్ణం చేసి నిమ్మకాయ, తేనెతో కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు రసాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలని గుర్తుంచుకోండి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని మనవి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..
Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు..
ఆ చీరనే.. ఈ చీర.. ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా మాయ దందా..!
ఆ చీరనే.. ఈ చీర.. ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా మాయ దందా..!
డీఎస్ ప్రస్థానం ఇదే.. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు..
డీఎస్ ప్రస్థానం ఇదే.. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు..
ముగిసిన మరో శకం.. ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటితో 'రో-కో' వీడ్కోలు
ముగిసిన మరో శకం.. ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటితో 'రో-కో' వీడ్కోలు
పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
రాముడు మంచి బాలుడిలా అన్నట్లున్న ఈ బుడ్డొడిని గుర్తు పట్టారా?
రాముడు మంచి బాలుడిలా అన్నట్లున్న ఈ బుడ్డొడిని గుర్తు పట్టారా?