కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ అధ్యయనం
ఒక్కసారి కరోనా సోకితే శరీరంలో దీర్ఘకాలం ఉంటుందా? ఇటీవల యువకుల్లో హాఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలకు గతంలో సోకిన కరోనా వైరస్సే కారణమా? కరోనా తగ్గినా వైరస్ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదా? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణులు మాత్రం ఆ అనుమానాలను కొట్టిపడేస్తున్నారు.
అయితే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం విస్తుపోయే విషయాలు వెల్లడించింది. కరోనా ఇన్‌ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు వేగంగా ముసలితనానికి గురయ్యే ప్రమాదం ఉందని అద్యయనం తేల్చింది. కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు. కరోనా సోకిన 432 మంది వ్యక్తుల మెదడు స్కాన్‌లు మహమ్మారికి ముందు, తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. 996 మంది ఆరోగ్యవంతుల స్కాన్‌లనూ పరిశీలించారు. వీరితో పోలిస్తే వ్యాధిబారిన పడినవారి మెదళ్లు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్టు గుర్తించారు. కరోనా బాధితులు ఏకాంతంలో గడపాల్సిరావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సిరావడం ఇందుకు కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. మహమ్మారికి గురైన వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగినవారు, తగినంతగా చదువుకోనివారు, ఇతర బలహీన నేపథ్యం కలిగినవారి మెదళ్లలో కీలక మార్పులు సంభవించినట్లు అధ్యయనంలో కనుగొన్నారు. మెదడు వృద్దాప్యానికి చేరువైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషణ, సేకరణ, అవగాహన శక్తి కోల్పోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకినవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించినట్లు అధ్యయనం రిపోర్టులో వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుపతిలో బైకు వెంటపడిన చిరుత.. తృటిలో..
రౌడీ బాయ్ పై గట్టిగా.. కంబ్యాక్ ఇచ్చిపడేశావ్‌పో..
Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ
మొబైల్ లో మునిగి పోయిన ముసలివాడు.. ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండగా.. ఏం చేసాడంటే
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి 'సుపారీ'

