AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Camphor: ఆర్ధిక కష్టాలు తీరాలంటే.. ఈ ధూపం వేస్తే మీ ఇంట సిరుల పంటే.!

Green Camphor: ఆర్ధిక కష్టాలు తీరాలంటే.. ఈ ధూపం వేస్తే మీ ఇంట సిరుల పంటే.!

Anil kumar poka
| Edited By: |

Updated on: Oct 13, 2024 | 9:00 AM

Share

కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి. వాటిలో పచ్చ కర్పూరం కూడా ఒకటి. కర్పూరం, పచ్చ కర్పూరాన్ని కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాగే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కర్పూరం చక్కగా పని చేస్తుందంటారు.

కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరంలో కూడా రకాలు ఉంటాయి. వాటిలో పచ్చ కర్పూరం కూడా ఒకటి. కర్పూరం, పచ్చ కర్పూరాన్ని కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాగే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కర్పూరం చక్కగా పని చేస్తుందంటారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు పచ్చ కర్పూరం ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని కూడా చెబుతారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో ఇలా ట్రై చేయండి.మార్పు మీరే గమనిస్తారు.

లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్ర పటం ముందు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నీరు పోసి అందులో పచ్చ కర్పూరం, పసుపు వేసి ఉంచండి. ఆ తర్వాత దీపారాధన చేయండి. ఇలా రెండు రోజులకు ఒకసారి నీటిని మార్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. అంతే కాకుండా ఆర్థిక సమస్యలకు కూడా ఓ పరిష్కారం లభిస్తుందని కూడా చెబుతారు. ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటుంది.

పసుపు లేదా పచ్చ రంగు ఉన్న వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని ఉంచి.. మూట కట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచాలి. ఆ తర్వాత దీపారాధన చేసి ధూపం వేయాలి. ఇలా రోజూ ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారన్నది ఓ నమ్మకం. పచ్చ కర్పూరాన్ని మీ పూజ గది లేదా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెబుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందట. క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా తీరి.. ధన వృద్ధి చెందుతుందట కూడా. అలాగే చిన్న పచ్చ కర్పూరం ముక్కను పేపర్‌లో కట్టి మీరు ఉపయోగించే పర్సులో ఉంచితే.. అప్పుల నుంచి బయట పడతారట కూడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us