Gaza War: ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది పూర్తి..

Gaza War: ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది పూర్తి..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2024 | 9:15 AM

ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధం ప్రారంభమై అక్టోబరు 7 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో హమాస్‌, హెజ్‌బొల్లా పై ఐడీఎఫ్‌ తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇదే సమయంలో హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌ పై క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం, పోర్ట్‌ సిటీ అయిన హైఫాపై సోమవారం తెల్లవారుజామున.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది.

ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధం ప్రారంభమై అక్టోబరు 7 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో హమాస్‌, హెజ్‌బొల్లా పై ఐడీఎఫ్‌ తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇదే సమయంలో హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌ పై క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం, పోర్ట్‌ సిటీ అయిన హైఫాపై సోమవారం తెల్లవారుజామున.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్‌ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది. ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. వీటి కారణంగా ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టారెంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా.. లెబనాన్‌ నుంచి రాత్రి వేళ 130కి పైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు, బీరుట్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి 30కి పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది. ఏ క్షణమైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన టెహ్రాన్‌.. వాటిని పునరుద్ధరించింది. తొలుత ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఆదివారం రాత్రి 11 గంటల నుంచే షెడ్యూల్‌ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆ దేశ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.