Dhavaleswaram: ధవళేశ్వరం బ్రిడ్జి మూసివేత.! మరమ్మతుల నేపథ్యంలో 10 రోజులు మూసివేత.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జికి సంబంధించి మరమ్మత్తుల నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ కాంక్షలు పోలీసులు విధించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరిజిల్లా ధవలేశ్వరంలో గురువారం నుంచి పది రోజులు పాటు కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేసారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జికి సంబంధించి మరమ్మత్తుల నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ కాంక్షలు పోలీసులు విధించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరిజిల్లా ధవలేశ్వరంలో గురువారం నుంచి పది రోజులు పాటు కాటన్ బ్యారేజ్ రహదారి మూసివేసారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ పైనుంచి ప్రయాణించే స్కూల్ బస్సుల యజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10 వరకు మరమ్మత్తులు జరుగుతాయని, అనంతరం ట్రాఫిక్ కి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీలేకుండా పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని, బ్రిడ్జి మరమ్మతు పనులను ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలనికలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోఎన్నో సంవత్సరాలుగా గోతులమయంగా మారిన ధవలేశ్వరం బ్యారేజ్ మరమ్మతు పనులు మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos