Watch Video: వైఎస్ కుటుంబంలో ఆయన చిచ్చుపెడుతున్నారు.. మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు
వైఎస్సార్ కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారన్నారు. షర్మిలను తమ పార్టీకి రాజకీయ శత్రువుగానే భావిస్తామన్నారు.
వైఎస్సార్ కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారన్నారు. షర్మిలను కూడా తమ పార్టీకి రాజకీయ శత్రువుగానే భావిస్తామన్నారు. ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని కేవలం నలుగురు మోస్తున్నారని ఎద్దేవా చేశారు. రఘువీరారెడ్డి, షర్మిల, గిడుగు రుద్రరాజు, కెవిపి రామచంద్రరావు… ఈ నలుగురు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు అంటున్నారని.. వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారో చెప్పాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

