Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

Phani CH

|

Updated on: Feb 21, 2025 | 7:28 PM

శాసనాలు చరిత్రకు ఆధారాలు. నాటి పాలనకు తార్కాణాలు. పురాతన గుళ్లను పునర్నిర్మాణం చేస్తుండగా లేదా ఏదైనా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా.. నిధి, నిక్షేపాలు, శాసనాలు బయటపడిన దాఖలాలు ఉన్నాయి. ఒక శాసనం బయపడితే అప్పటి చారిత్రక విశేషాలు విస్పష్టంగా అర్థమవుతాయి. దీనితో పరిశోధన చేయడం వీలవుతుంది. తాజాగా మాచర్ల జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది.

మాచర్లలో రుద్రమ దేవి కాలం నాటి శాసనం ఒకటి వెలుగు చూసింది. రాతిపై చెక్కిన ఈ శాసనం రెండు ముక్కలుగా దొరికింది. ఒక ముక్క చింతల రామలింగేశ్వర స్వామి గేటు వద్ద ఉండగా మరొక ముక్క పొలం గట్టున పడి ఉంది. అయితే ఈ రెండు ముక్కలు ఒకే శాసనమని వాటిని పరిశోధించిన చరిత్రకారుడు పావులూరి సతీష్ బాబు చెప్పారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతయినా ఉందని తెలిపారు. ఈ శాసనంలో శాలివాహన శకం 1210 సర్వధారి నామ సంవత్సం వైశాఖ మాసం 15న ఏర్పాటు చేసినట్లు ఉంది. క్రీశ 1288 ఏప్రిల్ 18 న చెక్కిన ఈ శాసనంలో కాకతీయ రుద్రదేవ మహరాజు అనగా.. రుద్రమదేవి సేవకుడు బొల్నాయిని కుమారుడైన మల్లిఖార్జున నాయకుడు… పల్లినాటి..అంటే ప్రస్తుత పల్నాడులోని మహాదేవచెర్ల.. అనగా ఈనాటి మాచర్లలోని రామనాథ దేవర అంగరంగ భోగాలకు… శ్రీ పర్వత మలినాథదేవర సాక్షిగా మెట్ట, మాగాణి భూములను దానం ఇచ్చినట్లుగా ఉంది. ఈ శాసనం నకలను 1942లో పురావస్తు శాఖాధికారులు సేకరించారని సతీష్ బాబు చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఈ శాసనాన్ని పరిరక్షించడంలో విఫలమవ్వడంతో రెండు ముక్కలైందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఈ శాసనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..

జంతువులు రెండు కాళ్లతో నడిస్తే ఇలా ఉంటుందా..

ఒక్క హగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం 20 సెకన్లలో