కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..
మునక్కాయలను ఇష్టపడని వారుండరు. ఎందుకంటే మునక్కాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు. మునగ కాయలే కాదు, మునగ ఆకుల్లో కూడా ఔషధగుణాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. మునగ కాయలు, మునగ ఆకులతో వివిధ రకాల వంటలు చేస్తుంటారు చాలామంది. మునగ ఆకులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. మునగ ఆకుల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అదనంగా ఇందులో ఫైబర్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకులు పొడిచేసుకొని పాలలో కలిపి తాగడం వల్ల, పలు ఆరోగ్య సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మునగ ఆకులతో తయారు చేసిన పొడిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మునగ ఆకుల పొడిని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. ప్రతి రోజూ సాయంత్రం టీకి బదులుగా పాలలో మునగ పొడి కలిపి తాగడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి మునగపొడి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మునగపొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా మునగ పొడిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని ప్రతి ఉదయం లేదా సాయంత్రం గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో కలిపి తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి మునగ పొడిని ఆహారంలో తీసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
