Pre Wedding Photoshoot : ఓ జంట శవంలా నీటి మీద తేలుతూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ..పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిందంటున్న నెటిజన్లు

|

Feb 08, 2021 | 4:24 PM

వెర్రి కుదిరింది.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటిఒకడు.. నేటి తరం యువత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు . ఇంటర్నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదోవిధంగా వార్తల్లో నిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ జంట పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ను డిఫరెంట్ గా చేసుకోవాలని ప్లాన్ చేసి ప్రస్తుతం...

Pre Wedding Photoshoot : ఓ జంట శవంలా నీటి మీద తేలుతూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ..పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిందంటున్న నెటిజన్లు
Follow us on

Pre Wedding Photoshoot : వెర్రి కుదిరింది.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటిఒకడు.. నేటి తరం యువత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు . ఇంటర్నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదోవిధంగా వార్తల్లో నిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ క్రియేటివ్ కి పదును పెట్టి.. రకరకాల పనులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

తాజాగా ఓ జంట పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ను డిఫరెంట్ గా చేసుకోవాలని ప్లాన్ చేసి ప్రస్తుతం నెటిజన్ల తో మీ క్రియేటివిటీ తగలడా.. శుభమా అంటూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించే ముందు.. ఈ పిచ్చి ఆలోచన్లేంటి అంటూ శుభాకాంక్షలతో పాటు.. తిట్లు కూడా తింటున్నారు..

నేటి యువత ఆలోచనల్లో ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఒకొక్కసారి వీరు చేసే పనులు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి.. వెరైటీ కోసం నీళ్లలో, కొండల్లో ఫోటో షూట్లు చేస్తున్నారు. అదృష్టం బావుంటే వైరల్ అవుతున్నారు. లేదంటే అడ్రస్ లేకుండా పోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో షూట్ చూస్తే మనం కూడా అదే మాట అంటాం. ఓ నదీ తీరంలో నల్ల దుస్తుల్లో ఓ జంట నీటిపై తేలుతూ కనిపించింది. వారిని చూసిన వాళ్లెవరైనా ఇద్దరూ కలిసి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారేమో అని అనుకుంటారు. కానీ ఇదంతా వారి క్రియేటివిటీనట. కాబోయే జంట ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్.. ‘లవర్స్ సూసైడ్’ థీమ్‌లో ఈ ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది.

ఈ ఫోటో షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అది చూసిన కొంత మంది  ఆ ఫోటో షూట్‌లేంటి.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరా చెప్పేందుకు.. చావు పేరు చెబితే చచ్చేంత వణికిపోతుంటారు.. పెళ్లి చేసుకుని హాపీగా జీవించాలి కానీ… బతికుండగానే శవాల్లా.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ అట..  దానికో పేరు.. మీ తెలిసి తెల్లవారినట్లే ఉంది.. మీ చదువు నేర్పింది ఇదేనా అంటూ నెటిజన్స్ ఈ జంటను కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీరికి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లుందని.. ఆత్మహత్య చేసుకుని ఒడ్డుకు కొట్టుకొచ్చిన ప్రేమికుల జంట కాదు.. అంటూ కామెంట్లు పెడతున్నారు. మరికొందరు ఇటువంటి పిచ్చి పనులు మానేసి పెళ్లి చేసుకుని హాయిగా జీవించమని పోస్టులు పెడుతున్నారు.

Also Read:

 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం

 పోపుల పెట్టె ఔషధాల గని… నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!