చియాసీడ్స్ ఇలా తిన్నారో.. అంతే సంగతులు !!
చియా సీడ్స్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సూపర్ ఫుడ్ అని మనందరికీ తెలుసు. త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ లో చియా సీడ్స్ ఒకటి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారంతో జీర్ణ శక్తి మెరుగవుతుంది. దీని వల్ల చాలా త్వరగా బరువు తగ్గిపోతారు.
అయితే, వీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియా సీడ్స్ హైడ్రోఫిలిక్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే, అవి నీటిని గ్రహించి వాటి పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దవిగా మారుతాయి. అయితే వీటిని నీటిలో నానబెట్టి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అది ఎందుకో..ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిపుణులు ప్రకారం… చియా సీడ్స్‌లో అధికంగా ఉండే ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు శరీరానికి బలాన్ని కలిగిస్తాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల సెల్ డ్యామేజ్‌ను నివారించడంలోనూ, ఇమ్యూనిటీని మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. అయితే చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టకుండా నేరుగా తినడం చాలా ప్రమాదకరం. నీటిని ఎక్కువగా పీల్చుకునే లక్షణం మూలంగా.. ఒక్కో చియా సీడ్.. ఏకంగా తన బరువుకు 27 రెట్ల నీటిని పీల్చుకుంటుంది. అందుకే.. పొడి చియా గింజలు తిని.. వెంటనే నీరు తాగితే.. అవి గొంతులో లేదా అన్నవాహికలో అడ్డుపడే ప్రమాదం ఉంది. గుప్పెడు గింజలు నోట్లో వేసుకుని.. వెంటనే నీరు తాగిన కొన్ని కేసుల్లో వీటిని..ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా వాటిని తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియాసీడ్స్ సురక్షితంగా, సులభంగా జీర్ణం కావాలంటే వాటిని కనీసం ఒక గంట పాటు నానబెట్టి తినాలి. లేదంటే… ఓ రాత్రంతా నీటిలో నానబెట్టి తినాలి. స్మూతీలు, సలాడ్స్, ఓట్స్, జ్యూస్‌లో కలిపి తినాలి. రోజుకు 1 నుంచి 2 టేబుల్ స్పూన్లకంటే ఎక్కువ తీసుకోకూడదు. తీసుకునేటప్పుడు తగినన్ని మోతాదులో నీరు తాగాలి. చియా సీడ్స్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందించినా, వీటిని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోకపోతే హానికరమే అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగాళాదుంప తొక్కలు పడేయకండి.. లాభాలు తెలిస్తే వదలరు!
చికున్ గున్యా.. ముప్పులో భారత్ !! మేలుకోకుంటే.. మునగటం ఖాయం
వామ్మో.. ఇన్నిరోజులూ ఆ మందుబాబులు తాగింది ఇదా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

