AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్

Peddi: పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 21, 2026 | 4:28 PM

Share

రామ్ చరణ్ కెరీర్‌లో కీలకంగా మారిన ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ చేంజర్’ నిరాశను మర్చిపోయేలా ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని చరణ్ భావిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్లలో తన పాన్ ఇండియా స్టామినాను మరింత బలపరచుకోవడమే లక్ష్యంగా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది.

పెద్ది సినిమాతో రామ్ చరణ్ చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏంటి.. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాతో చరణ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు.. తన పాత రికార్డులను తిరగరాస్తూ పాన్ ఇండియా స్థాయిలో పెద్ది సినిమాతో మెగా వారసుడు సృష్టించబోయే కొత్త సంచలనాలు ఏంటి.. అసలు ఈ సినిమాతో ఆయన దాటాల్సిన అడ్డంకులు.. చేరాల్సిన లక్ష్యాలు ఎన్ని..? రామ్ చరణ్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పెద్ది సినిమా మీదే ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా గేమ్ చేంజర్ చేదు జ్ఞాపకాలను పెద్ది సినిమాతో తుడిచేయాల్సిన బాధ్యత చరణ్ మీద ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అభిమానులకు పీడకలగా మిగిలిపోవడంతో.. ఇప్పుడు పెద్దితోనే ఫ్యాన్స్ కు అసలైన బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇవ్వాలని చరణ్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అదే జరిగితే పెద్ది ఒక పెద్ద లక్ష్యం దాటినట్టే. ఇక బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాతో తను క్రియేట్ చేసిన భారీ మార్కెట్ ను అలాగే నిలబెట్టుకోవడం చరణ్ ముందున్న మరో అతిపెద్ద సవాల్. అందుకే పెద్ది మేకర్స్ సైతం నార్త్ మార్కెట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ జరిగింది. మే 23న భూపాల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చరణ్ ముందున్న మరో లక్ష్యం కోలీవుడ్ మార్కెట్..! తమిళంలో తన సత్తా ఏంటో మరోసారి చూపించడానికి మెగా వారసుడు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తమిళనాట తనకంటూ ఒక సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఇప్పుడు పెద్ది సినిమాతో ఆ మార్కెట్ ను ఊహించని రేంజ్ లో మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా మారబోతోందని టాలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ డమ్ కు తగ్గట్టుగా అన్ని భాషల్లోనూ తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకుని పెద్ది సినిమాతో సరికొత్త రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న విడుదల కానుంది ఈ సినిమా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Paytm: టీనేజర్లకు పేటీఎం బంపర్‌ ఆఫర్.. కొత్త ఫీచర్ వైరల్

ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !

కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..

10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

Follow Us