Anil Ambani: అయ్యో అనిల్ అంబానీ.! అంబానీకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.!
ఒకప్పుడు అపరకుబేరుడిగా ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఒకప్పుడు అపరకుబేరుడిగా ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2008లో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన DAMEPL , ప్రభుత్వ రంగ సంస్థ DMRC ఒక కన్సెషన్ ఒప్పందా’న్ని కుదుర్చుకున్నాయి. దీనిపై వచ్చిన వివాదం విషయంలోనే DMRCకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై DMRC దాఖలు చేసిన క్యూరేటివ్ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రత్యేక ధర్మాసనం, తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సరైన నిర్ణయమే తీసుకుందని.. అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదని చెబుతూ మునుపటి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పన్కనపెట్టింది. తాజా తీర్పుతో అనిల్ కంపెనీ రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీకి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 19.99 శాతం మేర నష్టపోయి రూ.227.40 వద్ద స్థిరపడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

