అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పలు రైల్వే సేవల కోసం వేర్వేరు యాప్‌లను ఆశ్రయించే తిప్పలు తప్పిస్తూ.. అన్ని సేవలను ఒకే యాప్‌లో అందేలా తీసుకొచ్చింది. ఫ్లాట్‌ఫామ్ మీదికి తెచ్చేసింది. 'రైల్ వన్' అనే పేరుతో వచ్చిన సూపర్ యాప్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ రాకతో ప్రయాణ టిక్కెట్ల మొదలు అన్ని సేవలూ ఈజీగా పొందొచ్చని, దీనివల్ల కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు చెక్ పెట్టవచ్చని రైల్వే శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.
గతంలో ఉన్న యూటీఎస్ యాప్‌ను మరింత సరళీకరించటంతో బాటు మరిన్ని సేవలు అందేలా ఈ కొత్త యాప్ తెచ్చినట్లు రైల్వే మంత్రి తెలిపారు. గతంలో కౌంటర్లలోనే ఇచ్చే జనరల్ టికెట్లు, ప్లాట్ ఫామ్ టికెట్లు.. ఇక ‘రైల్ వన్’ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని ‘ఆర్-వాలెట్’ను వాడి.. జనరల్ లేదా ప్లాట్‌ఫామ్ టికెట్లు కొంటే.. 3 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. లాగిన్ చేసి, చిటికెలో రైలు లొకేషన్ ట్రాకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ చెకింగ్, ప్రయాణలో ఏదైనా ఇబ్బందులుంటే ఫిర్యాదులు చేసే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న.. ఐఆర్‌సీటీసీ రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ యథాతథంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉన్న ఈ యాప్‌ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో పలు రైల్వే సేవలకు వేర్వేరు యాప్‌లు ఉండటంతో, అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం ఇబ్బందికరంగా ఉండేది. ఈ యాప్‌తో ఒకేసారి సైన్ ఇన్ అవడంతో ఎక్కువ పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవాల్సిన పని తప్పింది. యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న రైల్ కనెక్ట్ లేదా యూటీఎస్‌ఆన్‌మొబైల్ ఐడీతో దీనిలో లాగిన్ కావ్వొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్
ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ
నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్..
అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక
అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

