ఓలా, ఉబర్ ప్రయాణికులకు షాక్.. కొత్త రూల్స్
రోజువారీ ప్రయాణంలో ఓలా, ఉబర్ సేవలు పొందే ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. రద్దీ సమయాల్లో ఉబర్, ఓలా సంస్థలు వసూలు చేస్తున్న సర్జ్ ప్రైసింగ్ పరిమితిని గణనీయంగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ‘మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్’ను సవరిస్తూ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది.
తాజా నిబంధనల ప్రకారం.. రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీని వసూలు చేసుకునేందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు క్యాబ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చనుండగా, రద్దీ వేళల్లో ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..
ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!
అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్
చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

