చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
సాధారణంగా చోరీ తర్వాత దొంగలు వీలైనంత త్వరగా అక్కడి నుంచి పారిపోతారు. దొరికినంతా దోచుకుని సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా మాయం అవుతారు. కానీ, ఈ దొంగ చోరీ చేసి, ఆ డబ్బుతో పూటుగా తాగేసి, మళ్లీ ఆ ఇంటికే వచ్చి.. గుర్రు పెట్టి నిద్రరోయాడు. ఆనక..పోలీసులొచ్చి నాలుగు తగిలించి నిద్ర లేపితే.. ‘ఏంటీ డిస్ట్రబెన్స్’అన్నట్లుగా లేచి చూస్తూ నిలబడ్డాడు.. ఈ దొంగ.
ఈ విచిత్ర ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగింది. బొబ్బిలిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో కృష్ణ అనే దొంగ పగటి పూట పక్కాగా రెక్కీ చేసి, తాళం వేసి ఉన్న ఓ ఇంటిని ఫిక్స్ చేశాడు. దే రోజు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి, బీరువాలోని వెండి వస్తువులను, ఇతర విలువైన సామాన్లను చక్కగా సంచిలో వేసుకొని, అమ్మి, వచ్చిన సొమ్ముతో ఫుల్‌గా మద్యం సేవించాడు. అంతేకాకుండా కొంత మద్యం వెంటతెచ్చుకొని తిరిగి వచ్చి ఆ ఇంట్లోనే మద్యపానం చేస్తూ, ఇంట్లో ఉన్న ఆహారపదార్ధాలన్నీ తింటూ మూడు రోజులు గడిపాడు. అలా మూడు రోజులు గడిచిన తరువాత ఇంటికి తాళం లేకపోవడం, ఇంటి యజమానులు కూడా బయటకు రాకపోవడం గమనించి స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటి యజమాని శ్రీనివాసరావుకి స్థానికులు ఫోన్ చేసి అడిగారు. దీంతో తాను ఇంకా బొబ్బిలికి రాలేదని, ఇంట్లో ఎవరో దొంగలు పడి ఉంటారని చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా మద్యం మత్తులో నిద్రిస్తున్న దొంగ కనిపించాడు. స్థానికులు మద్యం మత్తులో ఉన్న దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగతనం చేసిన వ్యక్తి అదే ఇంట్లో సౌకర్యవంతంగా మకాం వేయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..
ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!
అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్
చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్
ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

