బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..
ఆకలితో..రెస్టారెంట్‌కి వెళ్లిన ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన బటర్ నాన్, కర్రీ ఆర్డర్ చేశాడు. హ్యాండ్‌వాష్ చేసుకొచ్చేలోపు ఆర్డర్ టేబుల్‌పైన రెడీగా ఉంది. ఆవురావురుమంటూ తిందామని రెడీ అయ్యాడు. వేడి వేడి కర్రీలో బటర్‌నాన్ ముంచుదామని చూసిన అతను కర్రీలో ఉన్నది చూసి షాకయ్యాడు. ఎంతో ఇష్టమైన పన్నీరు కర్రీలో బొద్దింకను చూసి అసహనానకి గురయ్యాడు.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అందుగుల పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు స్థానిక సాయిలీల రెస్టారెంట్లో బటర్‌నాన్, పన్నీరు కర్రీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చింది. తీరా తిందామని రెడీ అయ్యేసరికి పనీర్ కర్రీలో బొద్దింక కనిపించింది. దీంతో కంగుతిన్న ఆ కుర్రాడు.. వెంటనే రెస్టారెంట్ సిబ్బందికి, నిర్వాహకులకి ఫిర్యాదు చేసి, దానిని చూపించాడు. అయితే, వారు అతడి మాటలను పట్టించుకోకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.దాంతో ఆ యువకుడు మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడి ఆహారంలో బొద్దింకను గుర్తించారు. ఆ ఆహారాన్ని మున్సిపల్ వాహనంలో తరలించారు. సదరు హోటల్‌కి రూ.20 వేలు ఫైన్ విధించి, మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే, హోటల్ సీజ్ చేస్తామని హోటల్ యజమానిని హెచ్చరించారు. తమ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, దీంతో.. హోటల్స్ లో భోజనం చేయాలంటే జనం భయపడుతున్నారని, శుభ్రమైన ఆహారం అందించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!
అదిరే ఫీచర్లతో.. ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్
చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్
ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

