సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా
నరదిష్టికి నల్లరాళ్లు బద్దలవుతాయనేది నానుడి. సాధారణంగా కొత్తగా నిర్మించే భవనాలకు, పంటచేలకు దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు పెడతారు. ఇళ్ళకు దిష్టితగలకుండా ఉండేందుకు గుమ్మడికాయలు కడతారు. ఇక ఇంట్లో పసి పిల్లలు ఉంటే వారికి రోజూ సాయంత్రం దిష్టి తీస్తారు. ఇదంతా ఓకే.. అయితే, ఏలూరులో ఓ ప్రభుత్వ కార్యాలయానికి దిష్టి తగిలిందంటూ దిష్టి బొమ్మలు కట్టారు అక్కడి సిబ్బంది.
అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏలూరు ఏజెన్సీ కుక్కునూరులోని ఫారెస్ట్ ఆఫీస్ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గేటుకి దృష్టి తగలకుండా బ్యానర్స్ కట్టారు. అందులో ఒకవైపు రాక్షసుడు , మరోవైపు కళ్ళ దిష్టి వినాయకుడి బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రభుత్వ కార్యాలయానికి ఇలాంటి దిష్టి తొలగించే బొమ్మలు అంటించటం పట్ల, స్థానికులతో పాటు, అటుగా వెళ్లే వారంతా దీనిపై చర్చించుకుంటున్నారు. ‘ఎవరి నమ్మకాలు వారివే గానీ.. మరీ ఇలా గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఇలాంటివి కట్టడం మూఢనమ్మకాలను ప్రోత్సహించటమే’ అంటూ కొందరు యువకులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

