న్యూ లేబర్ కోడ్స్ తో ఏం మారబోతున్నాయి ?? ఉద్యోగులకు లాభమా ?? నష్టమా ??
భారత ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను అమల్లోకి తెచ్చింది, నవంబర్ 21 నుండి ఇవి వర్తిస్తాయి. అలవెన్సులు వేతనంలో 50% మించకూడదనే నిబంధనతో చేతికొచ్చే జీతం తగ్గుతుంది. అయితే, పీఎఫ్, గ్రాట్యుటీ పెరుగుతాయి, తద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి. కంపెనీలు తమ శాలరీ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
భారత ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్‌లుగా పునర్నిర్మించింది. ఏళ్లుగా ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రతా కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్- 2020లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో వేతన గణనలో కీలక మార్పు చోటుచేసుకోబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం వేతనంలో అలవెన్సులు 50 శాతం మించరాదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఆ మేర శాలరీ విధానంలో మార్పులొచ్చి చేతికందే వేతనం తగ్గనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్ 21 నుంచి కొత్త కార్మిక కోడ్‌లు అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను 45 రోజుల్లో కేంద్రం వెలువరించనుంది. ఆ నిబంధనలను అనుసరించి ఆ మేర శాలరీ విధానంలో కంపెనీలు తమ శాలరీ విధానాన్ని మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త కోడ్‌ల ప్రకారం అలవెన్సులు 50 శాతానికి మించి ఉండకూడదు. అంటే బేసిక్, డియర్‌నెస్ అలవెన్సు, రిటైనింగ్ అలవెన్సు వంటివి 50 శాతం ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్+డీఏ తక్కువగా చూపుతూ అలవెన్సుల రూపంలో ఎక్కువగా చెల్లిస్తుంటాయి. కొత్త చట్టం ప్రకారం.. వేతన గణన మార్చాల్సి ఉంటుంది. దీంతో వేతనం పెరిగినప్పుడు ఆ మేర పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో పాటు, గ్రాట్యూటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రస్తుతం బేసిక్ శాలరీలో 12 శాతం పీఎఫ్ కింద వెళుతుంది. ఒకవేళ వేతనం పెరిగితే ఆ మేర పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. గ్రాట్యుటీ మొత్తం కూడా వేతనాన్ని బట్టే గణిస్తారు. అందువల్ల ఆ మేర ఆ మొత్తం కూడా పెరుగుతుంది. సవరించిన వేతన విధానం వల్ల చేతికొచ్చే జీతం తగ్గినా.. రిటైర్మెంట్ సమయంలో వచ్చే ప్రయోజనాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు వేతన విధానంలో ఆ మేర మార్పులు చేయాలి. అలాగని సీటీసీలో ఎలాంటి మార్పూ ఉండదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ
బైకర్‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్
ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం
40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

