ఇడ్లీ, దోశలు తింటే బరువు పెరుగుతారని భయమా ?? ఇది మీ కోసమే !!

|

Sep 02, 2024 | 8:33 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బరువు ఒక సమస్యగా మారింది. ఇది తింటే బరువు పెరిగిపోతాం.. అది తింటే వెయిట్‌ పెరుగుతాం అంటూ మొత్తానికి అల్పాహారాన్ని తినడం మానేస్తున్నారు. ఇడ్లీ, దోశలు తినాలని ఎంత కోరిక ఉన్నా బరువు పెరుగుతామనే భయంతో వాటి జోలికి పోరు. దాంతో రకరకాల పాశ్చాత్య అల్పాహారాలకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. అయితే, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బరువు ఒక సమస్యగా మారింది. ఇది తింటే బరువు పెరిగిపోతాం.. అది తింటే వెయిట్‌ పెరుగుతాం అంటూ మొత్తానికి అల్పాహారాన్ని తినడం మానేస్తున్నారు. ఇడ్లీ, దోశలు తినాలని ఎంత కోరిక ఉన్నా బరువు పెరుగుతామనే భయంతో వాటి జోలికి పోరు. దాంతో రకరకాల పాశ్చాత్య అల్పాహారాలకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. అయితే, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, రుచిలో రాజీ పడకుండా, బరువు పెరగకుండా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారాలు మన దక్షిణాదికే సొంతమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
దక్షిణాది రుచుల్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, బిసిబిళె బాత్, ఊతప్పం, అప్పం..వంటివి కొన్ని. ఇక వాటికి సాంబార్, చట్నీ కలిస్తే రుచి అమోఘం. సాధారణంగా మన టిఫిన్లలో పులియబెట్టే ప్రక్రియ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లో ప్రధానంగా వాడే బియ్యం, పప్పుల్లో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లూ, ప్రొటీన్లూ పుష్కలంగా ఉంటాయి. కండరాల మరమ్మతు, పెరుగుదలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక, దాదాపు మన వంటలన్నింట్లోనూ పసుపు, జీలకర్ర, ఆవాల్లాంటివి ఉండాల్సిందే. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు… రుతుక్రమ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. జీలకర్ర, ఆవాలు జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయి.
కిచిడీ, బిసిబిలె బాత్‌ లాంటి అల్పాహారాల్లో చిక్కుళ్లు సహా పలు కూరగాయలు వాడటంవల్ల పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బరువు పెరగకుండా చూస్తాయి. ఇడ్లీ, ఉప్మా.. ఆవిరి పట్టడం, ఉడకబెట్టడం వంటి పద్ధతుల్లో తయారుచేయడంవల్ల ఆ పదార్థాలు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. దాంతో కొవ్వులు, కేలరీలు తక్కువ పాళ్లలో ఉంటాయి. సాంబారు, చట్నీల్లో వాడే చింతపండు, కరివేపాకు, కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లను అందించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రాగి దోశ లాంటి తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సాయపడుతుంది. ఆకలినీ నియంత్రిస్తుంది. కాబట్టి, మన అల్పాహారాలు రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నీ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల లడ్డూకీ ఆధార్‌ లింక్‌.. టీటీడీ నిర్ణయంపై భక్తుల అసంతృప్తి

అంబానీని వెనక్కు నెట్టిన అదానీ.. భారత కుబేరుల లిస్ట్‌లో షారూఖ్‌ ఖాన్‌

పొరపాటున పూజారి అకౌంట్​లోకి రూ. కోటిన్నర.. తరువాత..

Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్‌ను ఇరగదీసిన రాహుల్ గాంధీ

సెట్ టాప్‌ బాక్స్‌ కోసం జియో టీవీ ఓఎస్‌ !! కాల్‌లోనే AI సేవలు