Uddanam: ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి లేదు.!

ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్. దశాబ్దాలుగా కిడ్నీవ్యాధులతో పోరాడుతున్న బాధితులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

Uddanam: ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి లేదు.!

|

Updated on: Dec 16, 2023 | 5:06 PM

ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్. దశాబ్దాలుగా కిడ్నీవ్యాధులతో పోరాడుతున్న బాధితులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం.. కిడ్నీ బాధితులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15 వేల మంది చనిపోయినట్లు అంచనా. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్‌ ప్రారంభించే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను అందించడంతో పాటు, వ్యాధి మూలాలను కనుగొనేందుకు పరిశోధనలు చేయడానికి వీలుగా అత్యంత అధునాతన పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ ఆసుపత్రి నిర్మాణం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జార్జ్‌ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది.

వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాక ముందు చేసిన పాదయాత్రలో ఉద్దానం బాధితుల కష్టాలను ఎంతో దగ్గరగా చూశారు. సరైన వైద్యం అందక, చికిత్సల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక, ఆర్థిక స్తోమత సరిపోక ఉద్దానం వాసులు పడే నరకయాతనను చూసి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే అధికారం చేపట్టిన మూడు నెలల్లోపే సెప్టెంబర్ 6, 2019న ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ మరియు రీసెర్చ్ సెంటర్ కు పునాదివేసారు సీఎం జగన్. అయితే వరుసగా రెండేళ్లు కరోనా సంక్షోభం కారణంగా నిర్మాణ పనులు కొద్దిగా ఆలస్యం అయినా, పూర్తిస్థాయిలో పనులను ఫిబ్రవరి 18, 2020న ప్రారంభించి రెండేళ్లలోపే నిర్మాణాన్ని పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్‌ను రూ.85 కోట్ల అంచనా వ్యయంతో, సుమారు 3.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, నాలుగు అంతస్తుల్లో, 200 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 98 సాధారణ పడకలు, 102 ICU, పే రూమ్స్ పడకలు ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us