Viral Video: సెన్షేషనల్ డ్యాన్స్‌తో హృదయాలను కొల్లగొడుతున్న చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Viral Video: శ్రీలంక గాయని యోహానీ దిలోకా డి సిల్వా పాడిన మానికే మాగే హితే పాట ఇంటర్నెట్‌లో ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే.

Viral Video: సెన్షేషనల్ డ్యాన్స్‌తో హృదయాలను కొల్లగొడుతున్న చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..
Child Dance
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 06, 2021 | 1:35 PM

Viral Video: శ్రీలంక గాయని యోహానీ దిలోకా డి సిల్వా పాడిన మానికే మాగే హితే పాట ఇంటర్నెట్‌లో ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. మే నెలలో విడుదలైన ఈ పాట.. ఇప్పటికీ ప్రజలను హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీల నుండి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కామప్ పీపుల్ వరకు అందరూ ఆ పాటకు స్టెప్పులు వేయడం, డబ్‌స్మాష్ చెప్పడం వంటివి చేసి తెగ రచ్చ చేశారు. తాజాగా 3 ఏళ్ల బాలిక మానికే మాగే హితే పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకునేలా ఉన్న ఆ చిన్నారి డ్యాన్స్ చూస్తే ఫిదా అయిపోవడం ఖాయం. సాధారణంగానే పిల్లలు ఏం చేసినా చాలా క్యూట్‌గా ఉంటుంది. ఈ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో మరింత క్యూట్‌గా ఉంది. రాస్‌భారీ తనేజా పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో ఈ చిన్నారి వీడియోను షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ అకౌంట్ కూడా ఆ చిన్నారిదే కావడం విశేషం. దాదాపు 5.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కాగా, ఈ వీడియోలో చిన్నారి అందమైన నీలిరంగు షరారా సెట్‌, హెయిర్ బ్యాండ్ ధరించి లిటిల్ ప్రిన్స్ మాదిరిగా వెలిగిపోయింది. మానికే మాగే హితే పాట పెట్టగానే.. ఆ చిట్టితల్లి అందమైన చిరునవ్వులు చిందిస్తూ అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఈ వీడియోలో చిన్నారి హావభావాలు, చిరునవ్వు, డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నారి అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు మంత్రముగ్దులైపోతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్, 2.5 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. నెటిజన్లు చిన్నారి డ్యాన్స్‌పై స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చిన్నారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదొక్క వీడియోనే కాదు.. రాస్‌భారీ తనేజాకు సంబంధించి మరెన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by Rasbhari (@rasbhari.taneja)

Also read:

Elections – BJP: కేంద్ర కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు ఇస్తారట.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ..!

Walking house: నడిచే ఇల్లు.. ఇక వాటితో పని లేదంతే.. క్రియేటర్‌కు సలా కొట్టాల్సిందే..!

Cheekati Koneru Secrete: మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం.. అసలు రహస్యం ఇదేనా?..