21న వచ్చే సూర్య గ్రహణం వెరీ స్పెషల్.. ఎందుకంటే!
2025 సెప్టెంబర్ నెలలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణం రెండూ అరుదుగా సంభవించడం విశేషం. ఇప్పటికే సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. ఇక సెప్టెంబర్ 21న సూర్య గ్రహణం రాబోతుంది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఇదే. దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూసినట్లయితే.. సూర్య గ్రహణం 2025 పితృ పక్షం చివరి రోజున ఏర్పడనుంది.
ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు. ఈ మహాలయ అమావాస్యకు హిందు సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పితృ పక్షం ప్రారంభమైంది. ఈ పితృ పక్షానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సుమారు 15 రోజుల పాటు ఈ పితృ పక్షాలు ఉంటాయి. భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఈ పితృ పక్షాలు ముగుస్తాయి. ఈ 15 రోజుల కాలం పూర్వీకులను స్మరించుకుంటూ.. వారికి పితృకార్యాలు చేసేదిగా పండితులు చెబుతారు. ఈ పితృ పక్షం సమయంలో పూర్వీకులు 15 రోజులు భూమి మీదకి వచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం. మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య ప్రస్తావన ఉందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మహాలయ అమావాస్య విశిష్టత ఏమిటంటే.. ఎవరైనా ఒక వ్యక్తి ఏరోజు, ఏ తిథిలో చనిపోయారో తెలియక వారి చనిపోయిన ఏడాదిలో, తిథిలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎంతో పుణ్యమని అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయని ఈ ఏడాది మొత్తం దాని ఫలితం ఉంటుందని కూడా చెబుతారు. ఇక.. తెలంగాణలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ఈ ఏడాది మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ 21వ తేదీను ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈ 9 రోజులు పార్వతీ దేవీని గౌరీ దేవీ రూపంలో ఘనంగా ఆరాధిస్తారు. ఆటపాటలతో, పకృతిలో సహజసిద్ధంగా పూచే పూలతో, సంప్రదాయ వంటలతో గౌరమ్మను పూజిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లంచం తీసుకుంటూ దొరికిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ టాపర్
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చంద్రబాబు మనవడు.. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్
Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

