AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచం తీసుకుంటూ దొరికిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ టాపర్

లంచం తీసుకుంటూ దొరికిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ టాపర్

Phani CH
|

Updated on: Sep 15, 2025 | 5:08 PM

Share

పేదరికంలో పుట్టి.. ఎంతో కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (OAS) 2019 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన అశ్వినీ కుమార్ పాండా.. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. ప్రస్తుతం సంబల్‌పూర్ జిల్లాలోని బమ్రా తహశీల్దార్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. లంచం తీసుకుంటూ ఒడిశా విజిలెన్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వ్యవసాయ భూమిని నివాస స్థలంగా మార్చేందుకు తన కార్యాలయ డ్రైవర్ ద్వారా రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ఒడిశాలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసి ఢిల్లీలో కొంతకాలం పని చేసిన తర్వాత అశ్వినీ కుమార్ పాండా దృష్టిని సివిల్ సర్వీసెస్ వైపు మళ్లింది. చాలా కష్టపడి చదివి 2019లో ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడమే కాకుండా ఏకంగా టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయం తర్వాత 2021 డిసెంబర్ 30న బాలేశ్వర్ కలెక్టర్ కార్యాలయంలో ట్రైనింగ్ రిజర్వ్ ఆఫీసర్ గా ప్రభుత్వ సర్వీసులో చేరారు. ఆ తర్వాత 2023 జూన్ 1న మయూర్‌భంజ్ జిల్లాలోని శ్యామకుంట తహశీల్దార్‌గా బదిలీ అయ్యారు. అనంతరం అంటే 2025 జూలై 1వ తేదీన సంబల్‌పూర్‌లోని బమ్రాకు బదిలీ అయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తుండగా ఆయన ఈ లంచం కేసులో ఇరుక్కున్నారు. తాజాగా భూమిని మార్పిడి చేయాలంటూ ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పని కోసం తహశీల్దార్ పాండా.. మొదట రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని ఫిర్యాదుదారుడు ఒక లేఖ ద్వారా తన నిస్సహాయతను వ్యక్తం చేయగా.. పాండా చివరకు రూ. 15,000కి తగ్గించారు. ఫిర్యాదుదారుడి నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఒక వ్యూహం ప్రకారం ట్రాప్ చేశారు. సెప్టెంబర్ 12న పాండా తన డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ద్వారా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుబడ్డారు. డ్రైవర్‌ను కూడా అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఈ అరెస్టు తర్వాత విజిలెన్స్ అధికారులు పాండా సంబల్‌పూర్‌లోని కార్యాలయంలో, పిడబ్ల్యుడి ఇన్‌స్పెక్షన్ బంగ్లాలోని ఆయన నివాసంలో, భువనేశ్వర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 4.73 లక్షల క్యాష్‌తో పాటు బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సేవ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్వీసెస్‌లో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఒక అధికారి.. లక్షల్లో జీతం వస్తున్నా కేవలం రూ. 15 వేల లంచం కోసం తన గౌరవాన్ని, ఉద్యోగాన్ని కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చంద్రబాబు మనవడు.. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్‌

Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే

Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. ఆ తర్వాత

దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు

Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?