‘సగం టైం ట్రాఫిక్‌లోనే.. ఇక చదివేదెలా ?? ’ బెంగళూరు స్కూలు పిల్లల వీడియో వైరల్
స్కూలులో గడిపే సమయం కన్నా బస్సులోనే ఎక్కువ టైమ్ గడపాల్సి వస్తోందంటూ బెంగళూరు స్కూలు పిల్లలు పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. బస్సులో వెనక సీట్లో కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు ఫోన్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. స్కూలు నుంచి 14 కి.మీ దూరంలో తమ ఇల్లు ఉందని, ఉదయం 40 నిమిషాల్లో బస్సులో స్కూలుకు వెళ్లే తమకు, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రెండున్నర గంటలు పడుతోందని వారు వాపోయారు.
గుంతల రోడ్లపై, ట్రాఫిక్‌లో ప్రయాణిస్తుంటే తమకు నరకం కనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు. పిల్లలు మాట్లాడుతుండగానే బస్సు ఓ గుంతలో నుంచి వెళ్లడంతో ఫోన్ తలకిందులు కావడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇది తమకు నిత్యకృత్యంగా మారిందని, తామేమీ అబద్ధం చెప్పడంలేదని ఆ పిల్లలు వివరించారు. స్కూలులో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడపటంతో తమకు ఇంటికి వెళ్లాక హోం వర్క్ చేయటానికీ, చదువుకోవటానికి టైం మిగలటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. ఆటలను తాము మరిచే పోయే పరిస్థితి ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు. రోజూ గంటల తరబడి ప్రయాణంతో శారీరకంగానే గాక.. మానసికంగానూ తాము ఒత్తిడికి గురవుతున్నట్లు వారు వాపోయారు. కాగా, సాయంత్రం అప్ లోడ్ చేసిన ఈ వీడియోను రాత్రి పొద్దుపోయేలోపు ఏకంగా 8 లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలో కర్ణాటక ముఖ్యమంత్రిని, ట్రాఫిక్ పోలీస్ అధికారుల్ని విద్యార్థినులు ట్యాగ్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ.. త్వరలో ఓటర్లుగా మారబోయే ఈ చిన్నారులు ఈరోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ పిల్లల ఆత్మవిశ్వాసం, తమ సమస్యను ధైర్యంగా, స్పష్టంగా, మర్యాదపూర్వకంగా చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
21న వచ్చే సూర్య గ్రహణం వెరీ స్పెషల్.. ఎందుకంటే!
లంచం తీసుకుంటూ దొరికిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ టాపర్
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చంద్రబాబు మనవడు.. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

