AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితుడి పెళ్లికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన యూట్యూబర్‌.. కట్‌ చేస్తే.. వెరైటీ శిక్షవిధించిన కోర్టు..!

బట్ వీడియోలో సింహం పిల్ల కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇంటర్నెట్‌లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వన్యప్రాణి అధికారి కేసు నమోదు చేశారు. సింహం పిల్లపై డోలాకు చట్టబద్ధమైన యాజమాన్యం ఉందని, అయితే ఆ జంతువు అతని ఆధీనంలో ఉన్నందున కోర్టు బట్‌ను బాధ్యులుగా పేర్కొంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి అసాధారణమైన శిక్షను విధించారు.

స్నేహితుడి పెళ్లికి ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన యూట్యూబర్‌.. కట్‌ చేస్తే.. వెరైటీ శిక్షవిధించిన కోర్టు..!
Pakistani Youtuber With Cub
Jyothi Gadda
|

Updated on: Feb 03, 2025 | 12:47 PM

Share

పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి పెళ్లిలో సింహం పిల్లను బహుమతిగా స్వీకరించి, దాని వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియోపై సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయగా.. కోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ యూట్యూబర్ మరెవరో కాదు, 5.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ రజబ్ బట్. ఇంతకీ ఏం జరిగింది..? ఏంటనే అసలు విషయంలోకి వెళితే..

డిసెంబర్ 2023లో యూట్యూబర్‌ రజబ్‌ పెళ్లిలో తోటి యూట్యూబర్ ఒమర్ డోలా ఈ విచిత్రమైన, ఊహించని గిఫ్ట్‌ ఇచ్చాడు. రజబ్‌ పెళ్లి కానుకగా సింహం పిల్లను అందించాడు ఒమర్‌ డోలా. డోలా లయన్ హబ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. బట్ వీడియోలో సింహం పిల్ల కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇంటర్నెట్‌లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వన్యప్రాణి అధికారి కేసు నమోదు చేశారు. సింహం పిల్లపై డోలాకు చట్టబద్ధమైన యాజమాన్యం ఉందని, అయితే ఆ జంతువు అతని ఆధీనంలో ఉన్నందున కోర్టు బట్‌ను బాధ్యులుగా పేర్కొంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి అసాధారణమైన శిక్షను విధించారు.

కోర్టు తీర్పు మేరకు..బట్ ప్రతి నెలా 5 నిమిషాల పాటు ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్‌పై అవగాహన కల్పిస్తూ వీడియోను రూపొందించాలి. అందులో అతను తన వీక్షకులకు వన్యప్రాణుల సంరక్షణ, జంతు సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తాడు. ప్రస్తుతం భట్టి అనే సింహం పిల్లను లాహోర్ జంతుప్రదర్శనశాలకు తరలించారు. అంతేకాదు..కంటెంట్‌ని రూపొందించడంలో బట్‌కు సహాయం చేయమని జూ పరిపాలనకు సూచించింది కోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..