Viral Video: 3 రోజులుగా లోయలో చిక్కుకుపోయిన లేగ దూడ.. ఆపద్భాందవులైన యువకులు

మరికొన్ని రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. వరదల కారణంగా 300 అడుగుల లోతులో చిక్కుకుపోయిన ఓ లేగ దూడ

Viral Video: 3 రోజులుగా లోయలో చిక్కుకుపోయిన లేగ దూడ.. ఆపద్భాందవులైన యువకులు
Save Calf
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2022 | 1:28 PM

మహారాష్ట్రను వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు థానె జిల్లాలో కుండపోత వర్షాలు ముంచేస్తున్నాయి. మరికొన్ని రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. వరదల కారణంగా 300 అడుగుల లోతులో చిక్కుకుపోయిన ఓ లేగ దూడను కాపాడేందుకు అక్కడి స్థానికులు గొప్ప సాహసమే చేశారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మలంగ్ గడ్ కొండ లోయలో ఓ లేడ దూడ ఒంటరిగా చిక్కుకుపోయింది. అది గమనించిన స్థానిక యువకులు సూర్యాజీ పావ్షే, మినాంట్ పావ్షే, కడం సాల్వి, జయశ్రీ పవార్ వాసర్ గ్రామానికి చెందిన మరో యువకుడు దూడను రక్షించాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి కొండ వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది.దూడ లోయ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడికి వెళ్లడం చాలా కష్టంగా ఉంది. పైగా భారీ వర్షం పడుతోంది. పైగా దట్టమైన పొగమంచు కారణంగా లోయలో ఏమీ కనిపించటం లేదు..అయినా సరే ప్రాణాలకు తెగించిన యువకులు… దూడ కోసం సాహసం చేశారు. కొండరాయికి తాడును కట్టి జాగ్రత్తగా కిందకు దిగారు. దూడ సమీపంలోకి చేరుకున్న తర్వాత దూడకు కూడా తాడు బిగించారు. ఆ తర్వాత అతి జాగ్రత్తగా దానిని పైకి లాగారు. ఎట్టకేలకు దూడను సురక్షితంగా రక్షించారు.

ఇవి కూడా చదవండి

కఠినమైన వాతావరణం కారణంగా వీరి రెస్క్యూ ఆపరేషన్ మరింత కఠినమైనది. కానీ, యువకులంతా కలిసి గంటలోపు దూడను రక్షించగలిగామని చెప్పారు. తొలుత గత మూడు, నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్న దూడ ఆగ్రహంతో తమపై దాడికి యత్నించిందని చెప్పారు. దూడను నియంత్రించిన యువకులు దానికి ఆహారం అందించారు. అనంతరం మలంగ్ గడ్ ప్రాంతంలోని మానవ నివాసంలో దూడను విడిచిపెట్టారు. యువకులు దూడను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు, స్థానికులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి