AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crocodile Video: మొసలి నోట్లో చెయిపెడితే ఊరుకుంటుందా..?.. రెండు దవడలు గట్టిగా వత్తేసింది.. షాకింగ్ వీడియో

గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ అటవీ అధికారి వినీలా తీకాధర్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే, అందులో నిజనిజాలు పక్కనపెడితే.. ఇక్కడ మరో మొసలి కథ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Crocodile Video: మొసలి నోట్లో చెయిపెడితే ఊరుకుంటుందా..?.. రెండు దవడలు గట్టిగా వత్తేసింది.. షాకింగ్ వీడియో
Crocodile
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2022 | 12:29 PM

Share

Crocodile Attacks Trainer: ప్రధానమంత్రి మోడీ చిన్నతనంలో ఒక మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చిన విషయాన్ని ఇటీవల తమిళనాడులోని ఒక ప్రైవేటు పాఠశాల ఫస్ట్ క్లాస్ పాఠ్య పుస్తకంలో చేర్చింది. దాంతో పెద్ద రచ్చమొదలైంది..‘అసలు గుజరాత్ చెరువులో మొసళ్ళు ఉన్నట్టు మా రికార్డుల్లో లేదంటూ, మోడీ చెప్పిన మొసలి విషయం నిజం కాదని,’ గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ అటవీ అధికారి వినీలా తీకాధర్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే, అందులో నిజనిజాలు పక్కనపెడితే.. ఇక్కడ మరో మొసలి కథ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొసలి, దాని ట్రైనర్‌కి సంబందించిన సరదా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోలో నోట్లో చేయిపెట్టిన ట్రైనర్‌కు మొసలి చుక్కలు చూపించింది.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో జంతులకు సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగులకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు భయానకరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్‌లోని ‘కావ్ యాంగ్’ అనే నేషనల్ పార్కు నుంచి విడుదలైన ఓ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. థాయ్‌లాండ్‌ లోని కావ్‌యాంగ్‌ నేషనల్‌ పార్క్‌ సందర్శనకు దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో పార్కును సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. అంతేకాదు అందులోని జంతువులను కూడా తరచూ పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ట్రైనర్‌ మొసలి నోటిలో చేయిపెట్టి మరీ ఏదో చేస్తున్నాడు. దాంతో ఆ మొసలికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా తెరచి ఉన్న దవడలను మూసి గట్టిగా కొరికింది.. అంతే దెబ్బకు ఆ ట్రైనర్‌ ఆమాడ దూరం పారిపోయాడు. అయితే, అతడి చేయి ఉందో లేదో మాత్రం తెలియదు. కానీ, ఈ షాకింగ్‌ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను animals_powers అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. మొసలి నోట్లోంచి బయటపపడ్డ అతడి చెయి ఉందా లేదా.. అనే సందేహంతో నెటిజన్లు పలుమార్లు వీడియోని క్లిక్‌ చేస్తున్నారు. దీంతో అత్యధిక వ్యూస్‌తో వీడియో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్