AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని నవ్వు తెప్పించేవి అయితే.. మరి కొన్ని షాక్‌కి గురి చేస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగానే మీరు షాక్‌కి గురవుతారు. ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. తన కూతురు పెళ్లి కోసం కొన్న నెక్లెస్ పొరపాటున చెత్తలో పడిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి తన పొరపాటును గ్రహించిన అతను వెంటనే..

Viral Video: చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..
Viral Video
Chinni Enni
|

Updated on: Jul 26, 2024 | 3:48 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని నవ్వు తెప్పించేవి అయితే.. మరి కొన్ని షాక్‌కి గురి చేస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగానే మీరు షాక్‌కి గురవుతారు. ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. తన కూతురు పెళ్లి కోసం కొన్న నెక్లెస్ పొరపాటున చెత్తలో పడిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి తన పొరపాటును గ్రహించిన అతను వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుకు స్పందించిన మున్సిపల్ అధికారులు నెక్లెస్ కోసం విస్తృతంగా గాలించారు. కొన్ని గంటల తర్వాత నెక్లెస్ చెత్తలో లభించింది. నెక్లెస్ లభించడంలో ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని దేవరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. తన కూతురు వివాహం కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కొన్నాడు. ఆ నెక్లెస్ అనుకోకుండా కింద పడి.. చెత్తలో కలిసి పోయింది. అనంతరం ఎంత వెతికినా కనిపించక పోయే సరికి చెత్తలో పడినట్టు గ్రహించిన దేవరాజ్. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే మున్సిపల్ అధికారి ఆ ప్రాంతంలోని చెత్తను తీసుకెళ్లిన సిబ్బంది వివరాలను అందించారు. చెత్త బండిని తీసుకెళ్లిన కార్మికులను గుర్తించిన దేవరాజ్.. వెంటనే వారి దగ్గరకు వెళ్లి అందులోని చెత్త మొత్తం వెతికారు. అప్పుడు నెక్లెస్ కనిపించింది. పూల మాలలో నెక్లెస్ చిక్కుకుంది. నెక్లెస్ లభించడంలో దేవరాజ్, మున్సిపల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. జోరుగా వైరల్ అవుతుంది.

Follow Us
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్