అమ్మాయిని చూస్తున్నాడని.. ఉరికించి మరీ కొట్టింది!
ప్రేమికుల మధ్య ఒకరికొకరు చెంపదెబ్బలు కొట్టుకునే, తిట్టుకునే స్వేచ్ఛ లేదంటే, వారిది బహుశా నిజమైన ప్రేమ కాదని కొద్దిరోజుల క్రితం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చెంప దెబ్బకే ఇంటెన్స్ లవ్ అనుకుంటే.. ల్యాప్‌టాప్‌తో కొట్టిన దానికి ఏ లవ్ అని అనుకోవాలి. ఒక భార్య తన భర్త మీద ప్రేమ ఎక్కువైపోయి ఏకంగా ల్యాప్‌టాప్‌తో కొట్టింది. అదీ కూడా విమానంలో.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా […]

ప్రేమికుల మధ్య ఒకరికొకరు చెంపదెబ్బలు కొట్టుకునే, తిట్టుకునే స్వేచ్ఛ లేదంటే, వారిది బహుశా నిజమైన ప్రేమ కాదని కొద్దిరోజుల క్రితం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చెంప దెబ్బకే ఇంటెన్స్ లవ్ అనుకుంటే.. ల్యాప్‌టాప్‌తో కొట్టిన దానికి ఏ లవ్ అని అనుకోవాలి. ఒక భార్య తన భర్త మీద ప్రేమ ఎక్కువైపోయి ఏకంగా ల్యాప్‌టాప్‌తో కొట్టింది. అదీ కూడా విమానంలో.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్‌గా ఓ జంట అమెరికాలోని మియామీలో ఫ్లైట్ ఎక్కింది. ఏమి జరిగిందో ఏంటో తెలియదు గానీ భార్య సడన్‌గా భర్తను ల్యాప్‌టాప్‌తో చితక్కొట్టడం మొదలుపెట్టింది. భార్య కొట్టే దెబ్బలకు తట్టుకోలేక భర్త సీట్ నుంచి పారిపోతూ.. “నాపై దాడి చేస్తున్నావా?” అని ప్రశ్నిస్తే.. “నేను దాడి చేస్తున్నా.. నేను దాడి చేస్తున్నా?” అంటూ బదులిస్తూ ప్రశ్నిస్తూ.. ఇంగ్లీష్‌లో బండ బూతులు తిడుతూ తరిమి తరిమి కొడుతోంది. ఇక ఈ తతంగాన్ని ఫ్లైట్‌లో ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. ఇక ఆ మహిళకు కోపం కట్టెలు తెంచుకోవడానికి కారణం ఏంటంటే.. ఆ భర్త సోషల్ మీడియాలో వేరే మహిళల ఫోటోలను ఆస్వాదించడమే అని తెలుస్తోంది. చూశారుగా దీన్ని ఏ ప్రేమని వర్ణించాలో మరి.
hot girl summer has been postponed until further notice pic.twitter.com/FpxR61NA7G
— Julia Scorupco (@juliascorupco) July 22, 2019
