‘ జొంబీ ‘ మీట్ దానికదే పాకుతూ…

ఫ్లోరిడాలో ఈ మధ్య ఓ రెస్టారెంటుకు వెళ్లిన ఓ కస్టమర్ కి వింతయిన అనుభవం ఎదురైంది. ఈ హోటల్లోని టేబుల్ మీద ఉంచిన మాంసం ముక్కల్లో ఒకటి దానికదే జీవం ఉన్నదానిలా పాకుతూ..ప్లేటు నుంచి జారి కింద పడిపోయింది. ఇది చూసిన ఓ మహిళ భయంతో కేకలు వేయగా.. రీ ఫిలిప్స్ అనే వ్యక్తి ‘ ధైర్యంగా ‘ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కేవలం వారం , పది రోజుల్లోనే దీనికి […]

' జొంబీ ' మీట్ దానికదే పాకుతూ...
Anil kumar poka

|

Jul 25, 2019 | 5:46 PM

ఫ్లోరిడాలో ఈ మధ్య ఓ రెస్టారెంటుకు వెళ్లిన ఓ కస్టమర్ కి వింతయిన అనుభవం ఎదురైంది. ఈ హోటల్లోని టేబుల్ మీద ఉంచిన మాంసం ముక్కల్లో ఒకటి దానికదే జీవం ఉన్నదానిలా పాకుతూ..ప్లేటు నుంచి జారి కింద పడిపోయింది. ఇది చూసిన ఓ మహిళ భయంతో కేకలు వేయగా.. రీ ఫిలిప్స్ అనే వ్యక్తి ‘ ధైర్యంగా ‘ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కేవలం వారం , పది రోజుల్లోనే దీనికి సుమారు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయట. అయితే ఇది ఫేక్ వీడియో అని కొందరంటే..మరికొందరు.. బహుశా ఆ మాంసం ముక్క లోని నాడుల్లో ఇంకా జీవం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఈ మటన్ ముక్కకు బహుశా స్ట్రింగ్ (కొక్కెం) వంటిది ఏదైనా అంటుకుని వుండవచ్చునని , టేబుల్ స్మూత్ గా ఉండడంతో అది ఇలా జారిపోయి ఉంటుందేమోనని విశ్లేషించారు. ఏమైనా.. ప్లేటులోని మాంసం ముక్క దానికదే ‘ గింగిరాలు ‘ తిరుగుతూ మెల్లగా జారిపోవడం ఆశ్చర్యకరమని అంటున్నవాళ్ళూ ఉన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu