Viral Video: ఇదెక్కడి కర్మ రా బాబు.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలకుంది.. కట్ చేస్తే సీన్ రివర్స్..
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. భయాన్ని కలిగించేవే కాకుండా..
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక రకాల వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. భయాన్ని కలిగించేవే కాకుండా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే వీడియోస్ కూడా అనేకం ఉన్నాయి. ఇక ఈ వీడియోస్ చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి.. మానసిక ప్రశాంతత కోసం నెట్టింట్లో ఫన్నీ వీడియోస్ చూసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అలాంటి ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూస్తే మీరు అనేస్తారు.. కర్మ అంటే అదే అని.. ఇంతకీ అందులో ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందాం..
ఆ వీడియోలో.. ఓ సరస్సు వద్ద కొందరు వ్యక్తులు ఎంజాయ్ చేస్తున్నారు.. కొందరు సరస్సు అందాలను చూస్తే ఎంజాయ్ చేస్తుండగా. మరికొందరు సరస్సు మధ్యలో ఉన్న చెక్క వంతెనపై చిన్న పిల్లల మాదిరిగా ఆడుకుంటున్నారు. ఇద్దరు స్త్రీలు ఆ వంతెనపై నిల్చుని వంతెనను కదిలిస్తూ ఆటలాడుతున్నారు. అదే సమయంలో వారి వెనక నుంచి ఓ మహిళ చేతిలో ఫోన్ పట్టుకుని వారితోపాటు ఆడుతూ ఎంజాయ్ చేయాలని వంతెనపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దీంతో చేతిలోని ఫోన్ నీటిలో పడిపోగా.. దానిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆమె కూడా వంతెనపై కుప్పకూలీపోయింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. కర్మ ఈజ్ ఫ్రీ.. కర్మ అంటే ఇదే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి..
View this post on Instagram
Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి
Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?