AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంత్రీకుడి సలహా మేరకు ఇంట్లో 20 అడుగుల గొయ్యి తవ్విన దంపతులు.. ఆ తర్వాత దక్కింది తెలిస్తే..

మీ ఇంటి భూగర్బంలో నిధి ఉందని, పాములు దాని కోసం కాపలాగా ఉన్నాయని చెప్పాడు.. పాములు పారిపోయి నిధి మీసొంతం కావాలనుకుంటే.. ప్రత్యేక పూజలు చేయాలని, ఆ తర్వాత భారీ గొయ్యి తవ్వితే నిధి బయటపడుతుందని చెప్పాడు. ప్రత్యేక పూజల అనంతరమే ఆ నిధి మీ సొంతమవుతుందని మాంత్రీకుడు చెప్పాడు.

మాంత్రీకుడి సలహా మేరకు ఇంట్లో 20 అడుగుల గొయ్యి తవ్విన దంపతులు.. ఆ తర్వాత దక్కింది తెలిస్తే..
Treasure
Jyothi Gadda
|

Updated on: Aug 23, 2023 | 10:04 PM

Share

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో నిధి ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి ఇంటి మధ్యన 20 అడుగుల లోతున గొయ్యి తవ్వించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ జ్యోతిష్యుడు హనూర్ తాలూకాలోని వీఎస్ దొడ్డి గ్రామానికి చెందిన భాగ్య ఇంట్లో నిధి ఉందని నమ్మించాడు. అతని మాటలు విన్న జమీందారు ఒక జ్యోతిష్యుని ఇంటికి పిలిపించి ప్రత్యేక పూజలు చేయించాడు..ఆ తర్వాత ఇంటి లోపల 3 అడుగుల వెడల్పు, 20అడుగుల లోతైన గొయ్యిని తవ్వించాడు.

మీ ఇంటి భూగర్బంలో నిధి ఉందని, పాములు దాని కోసం కాపలాగా ఉన్నాయని చెప్పాడు.. పాములు పారిపోయి నిధి మీసొంతం కావాలనుకుంటే.. ప్రత్యేక పూజలు చేయాలని, ఆ తర్వాత భారీ గొయ్యి తవ్వితే నిధి బయటపడుతుందని చెప్పాడు. ప్రత్యేక పూజల అనంతరమే ఆ నిధి మీ సొంతమవుతుందని పూజారి నమ్మించాడు.. పైగా ఇదంతా చెప్పినందుకు, పూజాది కార్యక్రమాలు చేసేందుకు గానూ అతడు వారి నుంచి భారీగానే డబ్బు వసూలు చేశాడు. ఇక అతని మాటలు నమ్మిన భాగ్య.. తమ్మూరులోని జ్యోతిష్యుడిని ఇంటికి రప్పించి రాత్రి ఆయనతో ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేసింది. తర్వాత భాగ్య దంపతులు, జ్యోతిష్యుడు, జ్యోతిష్యుడి స్నేహితులు అందరూ కలసి రహస్యంగా ఇంటిలోపల గొయ్యి తీయడం ప్రారంభించారు. అయితే, ఇదంతా ఇరుగుపొరుగు వారి నుండి నిధి రహస్యాన్ని దాచిపెట్టారు. తవ్విన మట్టిని ఇంట్లోని మరొక గదిలో కుప్పలుగా పోశారు.

వరుసగా మూడు నాలుగు రోజులు శ్రమించి 3 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతులో పెద్ద గుంత తవ్వారు. ఎవరికీ వినిపించకుండా, ఎలాంటి శబ్ధాలు రాకుండా నిధి కోసం తవ్వకాలు చేపట్టారు. కానీ, ఎలాగోలా విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు రామాపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకునే సమయానికి జ్యోతిష్యుడు, జ్యోతిష్యుడి స్నేహితుడు ఘటనా స్థలం నుంచి ఊడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తమ ఇంట్లో తరచుగా పాములు కనిపిస్తుండడంతో కేరళకు చెందిన మంత్రగాడిని సంప్రదించినట్లు చెప్పారు. పాములు ఉండటం వల్ల గుప్త నిధి ఉందని సూచించాడని, పూజ చేసి భూమిని తవ్వమని మంత్రగాడు చెప్పాడు. అతని సలహాతో దంపతులు 20 అడుగుల గొయ్యి తవ్వారు, కానీ ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు విచారణ జరిపి ఆ వ్యక్తిని హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు. జ్యోతిష్యుడి మాయ మాటలు నమ్మిన భాగ్య నిలువునా దోపిడీకి గురైంది. ఇటు ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..