అమృత గాత్రానికి గుర్తింపు లభించింది.. హాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
సోషల్‌మీడియాలో గతవారం వైరల్‌గా మారిన ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎవరో గుర్తు తెలియని మహిళ గానం చేసిన ఓ పాట ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. గాన కోకిల లతా మంగేష్కర్ క్లాసిక్ “ఏక్ ప్యార్ నగ్మా హై”ను సేమ్ టు సేమ్ అలాగే గానం చేసి తన తియ్యని గొంతుతో కట్టిపడేసింది. పశ్చిమబెంగాల్ రన్‌ఘాట్ రైల్వే స్టేషన్‌లో ఆమె పాడుతున్న సమయంలో ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ […]
సోషల్‌మీడియాలో గతవారం వైరల్‌గా మారిన ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎవరో గుర్తు తెలియని మహిళ గానం చేసిన ఓ పాట ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. గాన కోకిల లతా మంగేష్కర్ క్లాసిక్ “ఏక్ ప్యార్ నగ్మా హై”ను సేమ్ టు సేమ్ అలాగే గానం చేసి తన తియ్యని గొంతుతో కట్టిపడేసింది. పశ్చిమబెంగాల్ రన్‌ఘాట్ రైల్వే స్టేషన్‌లో ఆమె పాడుతున్న సమయంలో ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన ఎంతో మంది ఈమె ఎవరు, ఎక్కడుంటుంది? అనే ప్రశ్నలతో సతమతమయ్యారు. ఈ ఒక్క వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా సెలబ్రిటీ అయ్యిపోయింది. మంత్రముగ్ధం చేస్తున్న ఆమె కంఠం కోసం ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి.
ఈ వీడియోను “బార్‌పేట టౌన్” అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో అది ఏకంగా నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో అచ్చం లతా మంగేష్కర్‌లా గానం చేస్తున్న ఈమెను రాను మొండల్‌గా గుర్తించారు. ఇప్పుడు ఈమె గాత్రం కోసం ఎంతోమంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు మేకోవర్ చేయించి అందంగా ముస్తాబు చేస్తున్న పిక్స్ కూడా వైరల్‌గా మారాయి. ఇలాంటి ఎంతోమందిలో ఉన్న టాలెంట్ ప్రపంచానికి తెలియజేయడంలో సోషల్ మీడియా గొప్పతనంపై నెటిజన్లు సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.