పాత కారుకు బదులుగా.. కొత్త బీఎండబ్ల్యూ ఇచ్చారు!

పాత కారుకు బదులుగా.. కొత్త బీఎండబ్ల్యూ ఇచ్చారు!

సహజంగా మరొకరి భావాలతో ఆడుకుని దాని నుంచి నవ్వు తెప్పించేదే ప్రాంక్స్. ఇవి చాలామందికి నచ్చవు. అంతేకాకుండా కొంతమంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ బీఎండబ్ల్యూ సంస్థ చేసిన ఓ ప్రాంక్‌కు ఏకంగా ఓ మహిళ ఏకంగా 21 లక్షలు విలువజేసే బీఎండబ్ల్యూ కార్‌ను పొందింది. బీఎండబ్ల్యూ సంస్థ.. మీ పాత కారును ఇచ్చి కొత్త బీఎండబ్ల్యూను ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెబుతూ ఏప్రిల్ 1న ఈ ప్రకటన విడుదల చేసింది. ఫూల్స్ డే రోజు ఈ […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 12:17 PM

సహజంగా మరొకరి భావాలతో ఆడుకుని దాని నుంచి నవ్వు తెప్పించేదే ప్రాంక్స్. ఇవి చాలామందికి నచ్చవు. అంతేకాకుండా కొంతమంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ బీఎండబ్ల్యూ సంస్థ చేసిన ఓ ప్రాంక్‌కు ఏకంగా ఓ మహిళ ఏకంగా 21 లక్షలు విలువజేసే బీఎండబ్ల్యూ కార్‌ను పొందింది. బీఎండబ్ల్యూ సంస్థ.. మీ పాత కారును ఇచ్చి కొత్త బీఎండబ్ల్యూను ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెబుతూ ఏప్రిల్ 1న ఈ ప్రకటన విడుదల చేసింది. ఫూల్స్ డే రోజు ఈ యాడ్‌ను వాళ్ళు ప్రచురించడంతో అందరూ కూడా వట్టి పుకారని కొట్టి పారేశారు. కానీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ రాష్ట్రానికి చెందిన టినా మార్ష్ మాత్రం ఈ ప్రాంక్ ఎడ్వార్టైజ్మెంట్‌ను చూసి తన దగ్గర ఉన్న 15 సంవత్సరాల పాత మోడల్ నిస్సాన్ కార్‌ను తీసుకెళ్లి.. బదులుగా కొత్త బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూను ఇంటికి తెచ్చుకుంది.

ఆమె తన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ‘మొదట ఈ ప్రకటన చూసి వట్టి అబద్దమని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఎందుకు లైట్ తీసుకోవడం. ఒకసారి వెళ్లి చూస్తే ఏం జరుగుతుందని ప్రయత్నించాను. నేను, నా ఫ్రెండ్స్ కలిపి కారుతో సంస్థ దగ్గరకు వచ్చాం. అందరం కూడా ఓ చిన్న బొమ్మ కారు ఇచ్చి ఆ సంస్థ వాళ్ళు చేతులు దులుపుకుంటారని అనుకున్నాం. కానీ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ బ్రాండ్ న్యూ మోడల్ బీఎండబ్ల్యూ కారు ఇచ్చారని తన సంతోషాన్ని మాటల్లో చెప్పింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu