రోలర్ కోస్టర్ రైడర్.. సెల్ ఫోన్ ఎలా పట్టేసాడో !

రోలర్ కోస్టర్ రైడర్.. సెల్ ఫోన్ ఎలా పట్టేసాడో !

స్పెయిన్ లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్న ఓ రైడర్ అద్భుతమైన ఘన కార్యమే చేశాడు. ‘ శంబాలా ‘ అనే రోలర్ కోస్టర్ పై ఆకాశానికి అంతెత్తున ఎగురుతూనే.. ఎవరూ ఊహించని.. అసాధ్యమైన పనికి ” ఆద్యుడయ్యాడు ”. మరేం లేదు.. గంటకు 134 కి. మీ. వేగంతో ఇది పైకి దూసుకుపోతుండగా.. కో-ప్యాసింజర్ జార విడిచిన సెల్ ఫోన్ ని తన చేతిలో అలవోకగా పట్టేశాడు. […]

Pardhasaradhi Peri

|

Sep 09, 2019 | 3:14 PM

స్పెయిన్ లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్న ఓ రైడర్ అద్భుతమైన ఘన కార్యమే చేశాడు. ‘ శంబాలా ‘ అనే రోలర్ కోస్టర్ పై ఆకాశానికి అంతెత్తున ఎగురుతూనే.. ఎవరూ ఊహించని.. అసాధ్యమైన పనికి ” ఆద్యుడయ్యాడు ”. మరేం లేదు.. గంటకు 134 కి. మీ. వేగంతో ఇది పైకి దూసుకుపోతుండగా.. కో-ప్యాసింజర్ జార విడిచిన సెల్ ఫోన్ ని తన చేతిలో అలవోకగా పట్టేశాడు. శామ్యూల్ కెంఫ్ అనే ఇతగాడి ఈ ‘ క్యాచ్ మెంట్ ‘ నైపుణ్యం వీడియోకెక్కింది. ఇది పోస్ట్ చేసిన రెండు మూడు రోజులకే 15 లక్షల పైగా వ్యూస్ దక్కించుకుని వావ్ అనిపించింది. సాధారణంగా స్పెయిన్ లో ఇంత వేగంతో ‘ ఎగిరే ‘ రోలర్ కోస్టర్లు అరుదట.. శంబాలా అని వ్యవహరించే ఈ కోస్టరే ఒక విధంగా ‘ చాలా ప్రమాదకరమైనదని ‘ అంటారు. అంటే అత్యంత వేగంగా ఇది దూసుకుపోతుంది. దీన్ని ఎక్కేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిందే..అయినా శామ్యూల్ ఇటీవల ఈ పని చేసి రికార్డులకెక్కాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu