Viral: ఒక్క కామెంట్ ఆమెను ఉద్యోగం నుంచి పీకించింది.. ఇంతకీ అసలేం జరిగిందంటే!
ఒక్క కామెంట్ ఆమెను ఉద్యోగం నుంచి పీకించింది.. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ప్రతీ రంగంలోనూ పురుషులకు పోటీనిస్తున్నారు మహిళలు. ఇందుకు ఉదాహారణలు లేకపోలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలు రంగాల్లో పురుషాధిపత్యం కొనసాగుతోంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించిన ఓ మహిళ.. చివరికి తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. తనకు కలిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఆమెకు పెద్ద ఎత్తున నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ కథేంటంటే.!
జాన్నెకీ అనే మహిళా ఉద్యోగి తన ఉద్యోగం ఎలా పోయిందో వరుస ట్వీట్ల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ‘కంపెనీ నాకొక ప్రాజెక్ట్ ఇచ్చింది. దాన్ని నేను కొంతవరకు పూర్తి చేశాను. అయితే నేను సెలవులో ఉన్నప్పుడు.. నా సహోద్యోగి ఆ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేశాడు. ఏం చేశాడన్న వివరాలు నాకు చెప్పలేదు. అయితే అతడు చేసిన మార్పుల వల్ల ప్రాజెక్ట్ తలక్రిందులైంది. ఈ విషయంపై అతడి దగ్గర ప్రస్తావన తీసుకొచ్చా. ఇలాంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో ఏం చెయ్యాలో సూచనలు ఇవ్వాలని కోరాను’.
‘ఈ అంశంపై మా ఇద్దరి చర్చ జరిగింది. ప్రతీసారి అతడు నా మాటలకు అడ్డుపడుతూ వచ్చాడు. నేను వివరణ ఇస్తున్న సమయంలో.. కల్పించుకుని మరీ అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకే నేను మర్యాదగా.. నా మాటలు అయిన అనంతరం మీరు చెప్పండి అని పేర్కొన్నాను. ఈ మీటింగ్ అనంతరం సోమవారం నాకు హెచ్‌ఆర్ నుంచి కాల్ వచ్చింది. నేను చాలా అసభ్యంగా ప్రవర్తించానని.. నా కమ్యూనికేషన్ స్కిల్స్ అద్వానంగా ఉన్నాయని చెప్పి.. నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు’. ఓ పురుషుద్యోగి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ప్రశ్నించాను’ ఇందులో ఏమైనా తప్పు ఉందా.? దీని వల్ల నా ఉద్యోగం పోయింది. టెక్ ఇండస్ట్రీలలో మహిళల పరిస్థితి ఇదేనంటూ ఆమె వరుస ట్వీట్ల ద్వారా తన స్టోరీ చెప్పుకొచ్చింది.
A couple weeks ago, a male colleague made changes to a project I was running while I was offline that dramatically impacted the scope and timelines. I asked to talk to him to understand why and how we could set up a way to solve issues in the future.
— Janneke Parrish (@JannekeParrish) July 20, 2022
I was fired because I wouldn’t let a man talk over me. This is what it’s like to be a woman in the tech industry. It’s brutal and it’s toxic, and it’s where your gender determines your fate before you ever have a chance.
— Janneke Parrish (@JannekeParrish) July 20, 2022
On Monday, I got called into a meeting with HR, where I was told I had been incredibly rude, that my communication skills were abysmal, and I was being fired.
— Janneke Parrish (@JannekeParrish) July 20, 2022
కాగా, జాన్నెకీ పారిష్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఒక్క టెక్ ఇండస్ట్రీ మాత్రమే కాదని.. ఇతర రంగాల్లో కూడా స్త్రీలు వివక్షను ఎదుర్కుంటున్నారని కొంతమంది కామెంట్ చేయగా.. మరికొందరు కొన్ని బడా కంపెనీలు.. ఇంకా లింగ బేధాలు చూస్తున్నాయని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.