Viral: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు

ఇది అలాంటి, ఇలాంటి కేసు కాదు. వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయ్యింది. వివాహం అనంతరం భర్త వెంట వెళ్లాల్సిన మహిళ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది

Viral: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు
Divorce Case
Follow us

|

Updated on: Jan 12, 2022 | 7:54 AM

ఇది అలాంటి, ఇలాంటి కేసు కాదు. వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయ్యింది. వివాహం అనంతరం భర్త వెంట వెళ్లాల్సిన మహిళ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది. శుభముహూర్తం లేదంటూ ఆమె 10 ఏళ్ల నుంచి భర్త దగ్గరికి వెళ్లేందుకు నిరాకరిస్తూ వస్తుంది. దీంతో విసిగి వేసారిన భర్త.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అతడి వాదనను అర్థం చేసుకున్న కోర్టు, భర్తను బాధితుడిగా భావిస్తూ విడాకులు మంజూరు చేసింది. వివాహం అనంతరం.. భార్య తన భర్తతో కాకుండా విడిగా జీవిస్తుంటే.. ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడేనని కోర్టు పేర్కొంది.  10 సంవత్సరాలుగా తన భర్తకు, భార్య దూరంగా ఉండటాన్ని అసాధారణ అంశంగా కోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే..  రాయ్‌గఢ్‌లో నివసిస్తున్న సంతోష్‌సింగ్‌కు జంజ్‌గిర్‌లో నివాసం ఉంటున్న అమితా సింగ్‌తో 2010 జూలైలో పెళ్లి జరిగింది.  పెళ్లయిన 11 రోజుల అనంతరం అత్తమామలు వచ్చి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి తన భార్యను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె తిరిగి అత్తగారి ఇంటికి రాలేదు. సంతోష్ సింగ్ ఆమెను తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ,  శుభముహూర్తం లేదని వెళ్లేందుకు నిరాకరించింది భార్య. ఈ విధంగా పదేళ్లు గడిచిపోయింది. దీంతో సంతోష్ తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ రాయ్‌గఢ్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీన్ని చిన్న కారణంగానే పరిగణించిన ఫ్యామిలీ కోర్టు, విడాకులను తిరస్కరించింది. దీంతో అతడు మళ్లీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు‌లో పిటిషన్ వేశారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిస్తూ విడాకులు తీసుకోవాలని ఆదేశించింది. భర్తతో భార్య కలసి జీవించని క్రమంలో భర్త హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం విడాకుల డిక్రీని పొందవచ్చని పేర్కొంది. ఈ కేసులో భార్య తరఫున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది.. భర్త ఇంటికి వెళ్లేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉందని, కానీ ముహూర్తం సరిగా లేదని వాదించడం కొసమెరపు.

Also Read: Guntur: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ప్రభుత్వ విప్ పిన్నెల్లి బంధువుల మృతి..