Viral News: ఫోన్, ల్యాప్‌టాప్‌ను డిటర్జెంట్‌తో కడిగిన భార్య.. వింత ప్రవర్తకు షాక్ అయిన ఆ సాఫ్ట్‌వేర్ భర్త ఏం చేశాడంటే..
Viral News: కొందరు శుభ్రత విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటారు. పదే పదే చేతులు కడగడం, వస్తువులను శుభ్రం చేస్తుంటారు. దీనిని మెడికల్ పరిభాషలో అబ్సెసిసివ్ కంపల్సివ్ డిజ్ ఆర్డర్ అంటారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన...
Viral News: కొందరు శుభ్రత విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటారు. పదే పదే చేతులు కడగడం, వస్తువులను శుభ్రం చేస్తుంటారు. దీనిని మెడికల్ పరిభాషలో అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ అంటారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ చిత్రం అచ్చంగా ఇలాంటి కథాంశంతో తెరకెక్కిందే. ఈ సినిమాలో హీరో శర్వానంద్ ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. తన అతి శుభ్రతతో ఇతరులకు చిరాకు తెప్పిస్తుంటాడు. ఇది బంధాలను కూడా దూరం చేస్తుందన్నట్లు సినిమాలో చూపించారు. అయితే అది సినిమానే కదా.. అని కొట్టి పారేయకండి. ఎందుకంటే నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. భార్య అతి శుభ్రతను తట్టుకోలేని ఓ భర్త ఏకంగా విడాకులే ఇచ్చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 2009లో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే అతనికి ఆన్ సైట్‌లో భాగంగా ఇంగ్లండ్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో భార్యతో కలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. కొన్ని రోజుల వరకు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే వీరిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత భార్యలో చోటు చేసుకున్న వింత ప్రవర్తనను గుర్తించాడు భర్త. ఎంబీఏ చదువుకున్న సదరు మహిళా.. అతి శుభ్రతను చూసి భర్త షాక్‌కి గురయ్యాడు. బయట నుంచి రాగానే దుస్తులు, మొబైల్ ఫోన్‌ను కడుగుతుండడంతో అతనికి చిరాకు వేసేది. దీంతో ఈ అంశంపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవి. దీంతో భార్యకు కౌన్సిలింగ్ ఇప్పిచ్చాడా భర్త. అనంతరం ఈ జంట తిరిగి భారత్ వచ్చేశారు. భార్య మారిపోయిందని సంతోషాడు. ఈ క్రమంలోనే ఈ జంటకు రెండో సంతానంగా కుమారుడు జన్మించాడు.
అంతా బాగా సాగుతుందనుకుంటున్న సమయంలో కరోనా సమయంలో మరోసారి భార్య అతిశుభ్రతను తట్టుకోలేకపోయాడు. ఈసారి ఆమె ఏకంగా భర్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను డిటర్జెంట్‌తో కడిగేసింది. అంతటితో ఆగకుండా అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియలకు హాజరైన భర్తను, ఇద్దరు పిల్లల్ని నెల రోజుల పాటు ఇంట్లోకి అనుతమించలేదు. దీంతో భార్య వింత ప్రవర్తనకు షాక్‌కి గురైన సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భార్య అతికి విసుగెత్తిపోయాడు. వెంటనే తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టు మెట్లుఎక్కాడు.
పలుమార్లు వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయితే తనతో జీవించడం ససేమిరా అని చెబుతోన్న భర్త విడాకులు కావాలని పట్టుతో ఉన్నాడు. కానీ సదరు మహిళ మాత్రం తన భర్త కావాలనే తన నుంచి విడాకులు తీసుకుంటున్నాడని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. చూశారుగా.. శుభ్రత పాటించడంలో తప్పు లేదు.. కానీ అది శృతి మించితేనే ఇలాంటి సమస్యలు వస్తాయి.
Also Read: IND vs NZ, 2nd Test, Day 1 Live Score: మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్.. ఆచి తూచి ఆడుతోన్న ఓపెనర్స్..
Akhanda: అఖండ సినిమాకు బ్రేక్ వేసి షాక్ ఇచ్చిన అధికారులు.. బెనిఫిట్ షో వేశారని థియేటర్ సీజ్