సంక్రాంతికి రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి.. ప్రత్యేక రైళ్లు కావాలన్న ప్రయాణికులు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సర్కార్..(వీడియో)

సంక్రాంతికి రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి.. ప్రత్యేక రైళ్లు కావాలన్న ప్రయాణికులు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సర్కార్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 03, 2021 | 9:40 AM

సంక్రాంతి వచ్చేస్తోంది... అందరూ సొంతూళ్లకు పయనమయ్యేందుకు సన్నాహాలు మొదలు పెట్టేసారు. అంటే సంక్రాంతి ఇంకా నెలరోజుల పైనే ఉందనుకోండి.. కానీ ఇప్పటినుంచి ప్రిపేర్‌ అయితేనే కదా.. అప్పటికి హ్యాపీగా మనింటికి వెళ్లగలం. కానీ...


సంక్రాంతి వచ్చేస్తోంది… అందరూ సొంతూళ్లకు పయనమయ్యేందుకు సన్నాహాలు మొదలు పెట్టేసారు. అంటే సంక్రాంతి ఇంకా నెలరోజుల పైనే ఉందనుకోండి.. కానీ ఇప్పటినుంచి ప్రిపేర్‌ అయితేనే కదా.. అప్పటికి హ్యాపీగా మనింటికి వెళ్లగలం. కానీ ఈ ఉత్సాహంపైన రైళ్లు నీళ్లు చల్లుతున్నాయి. సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి.అవును ట్రైన్లలో రిజర్వేషన్లు అన్నీ పూర్తయి పోయాయి. ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ చూస్తూ చాంతాడంత ఉంది. ఈ క్రమంలో వెయిటింగ్‌ లిస్ట్‌లో కూడా టికెట్‌ దొరకడం కష్టమే. జరవరి 9 ఆదివారం కావడంతో 8 తారీకు నుంచే స్వస్థలాలకు ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దాంతో జనవరి 8 నుంచి 13 వ తేదీ వరకు టికెట్లు దొరికే పరిస్థితి లేదు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉంది. ఇక రాజమండ్రి వెళ్లాలనుకునేవారికీ టికెట్లు లేవు. రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్లు, పూర్తయిపోవడమే కాకుండా వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా భారీగా ఉండటంతో ప్రత్యేక రైళ్లు ప్రకటించానలి ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..