
పులస నుండి ట్యూనా వరకు మత్స్యకారులు ఎన్నో రకాల చేపలు పడుతుంటారు. మరి అన్ని చేపలు పట్టే మత్స్యకారులు అత్యంత ఇష్టంగా తినే టేస్టీ, హెల్దీ చేప ఏంటో మీకు తెలుసా? అదే జెర్రీ చేప. ఈ పోషకాల ఘని గురించి మీకోసం. ఇవి పొడవుగా, పెద్దగా ఉంటూ చిన్న చేపలను వేటాడి తింటాయి. ఈ చేప అత్యధిక పోషకాలతో పాటు అత్యంత రుచిగా కూడా ఉంటుంది. అందుకే చేపలు ఇష్టపడే వారు, మత్స్యకారులకు ఇష్టమైన చేపల్లో ఒకటిగా ఈ జెర్రీ చేపను పిలుస్తారు.
ఈ జెర్రీ చేప దంతాలు చాల పదునుగా ఉంటాయి. లేత తెలుపు రంగులో సన్నగా ఉండి పొడవాటి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఈ చేపకు కింద దవడ పొడవుగా ఉంటుంది. సూదిగా ఉండే నోటి భాగాన్ని కలిగి ఉంటుంది. దీంతో వేటాడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ చేపలు ప్రధానంగా హిందూ మహాసముద్రం పరిధిలోని తీర ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. సముద్రరొయ్యలు, కీటకాలు, చిన్న చేపలను వేటాడి తింటాయి. ఇవి ఉష్ణ మండల ప్రాంత సముద్రాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ జెర్రీ చేపలు అన్ని సీజన్లలోనూ దొరుకుతాయి. ఆహారం కోసం రాత్రులు నీటి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. అప్పుడు సులువుగా మత్స్యకారులు వీటిని పట్టుకుంటారు.
ఇకపోతే, డిమాండ్ ని బట్టి జెర్రీ చేప ధర ఉంటుంది. మాములుగా కిలో 300 రూపాయిలు గా ఉంటుంది. డిమాండ్ బట్టి 400 రూపాయల వరకు పలుకుతుంది. దీని రుచి కారణంగా ధర చూడకుండా ప్రజలు కనుగోలు చేస్తున్నారు. ఈ జెర్రీ చేప రుచి తో పాటు అధిక పోషకాలు ఉంటాయి. దీనిలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..