AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వా ఏం వాడకం భయ్యా.. సైలెన్సర్లతో సరికొత్త ఆవిష్కరణలు.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా వాహనదారులు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా సౌండ్స్‌ చేసే వాహనాల నుంచి స్వాధీనం చేసుకున్న సైలెన్సర్స్‌ను పోలీసులు ఏం చేస్తారు రోడ్‌రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం దీనికి బిన్నంగా ఆలోచించారు. ఈ సైలెన్సర్‌తో వివిధ రకాల ఆకారాలను తయారు చేయించి వాటిని నగరంలోని కూడల్లలో జనాలను ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. వీటిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

వా ఏం వాడకం భయ్యా.. సైలెన్సర్లతో సరికొత్త ఆవిష్కరణలు.. ఎక్కడో తెలుసా?
Hanmakonda Police
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 16, 2025 | 10:54 PM

Share

సౌండ్ పొల్యూషన్ వాహనాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు.. రీమాడిఫయిడ్ చేసిన వాహనాల నుంచి సైలెన్సర్స్‌ తొలగిస్తూ ఉంటారు. అలా బైక్స్ నుండి తొలగించిన సైలెన్సర్లను ధ్వంసం చేయడం సహజంగా చూస్తుంటాం.. కానీ హనుమకొండలో ట్రాఫిక్ పోలీసులు ఆ సైలెన్సర్లతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టారు. తొలగించిన సైలెన్సర్లతో జనం ఆలకించేలా వినూత్న ఆకారాలతో ఔరా అనిపిస్తున్నారు. హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు ఏర్పాటుచేసిన సైలెన్సర్ల రాకెట్ నమూనా చూపర్లను ఆకట్టుకుంటుంది.

హెవీ స్పీడ్ బైక్స్ వాహనాల శబ్ద కాలుష్యం పై వరంగల్ కమిషనరేట్ లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. గత ఏడాది వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1,246 సైలెన్సర్లు తొలగించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 592 సైలెన్సర్లను తొలగించి ఆ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఐతే హనుమకొండలో కొన్ని పబ్లిక్ ప్లేస్ లో రోడ్డు రూలర్ ద్వారా సలెన్సర్స్‌ను ధ్వంసం చేసి వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.. మరికొన్ని సైలెన్సర్లతో వినూత్న ఆకారాలు తయారుచేసి పబ్లిక్ ప్లేస్‌లలో అమర్చారు. హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్, అశోక జంక్షన్, కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ , అంబేద్కర్ సర్కిల్ లో సైలెన్సర్స్‌తో ఏర్పాటు చేసిన వినూత్న ఆకారాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

హనుమకొండలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ ముందు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన రాకెట్ నమూనా పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ల నుండి తొలగించిన ఒకే సైజు సైలెన్సర్లను సెలెక్ట్ చేసుకుని ఈ తరహా డిఫరెంట్ నమూనాను తయారుచేసి ఇక్కడ ప్రతిష్టించారు. ఈ మార్గంలో వెళ్లే ప్రతి వాహనదారుడు ఈ నమూనాని చూసి వాహ్ అని ఆశ్చర్య పోతున్నారు.

నాలుగు రోజులపాటు శ్రమించి రాకెట్ నమూనా ఆకారాన్ని తయారుచేసి ఇక్కడ అమర్చారు. హనుమకొండ అశోక జంక్షన్‌లో రోబో నమూనాలో సైలెన్సర్ ఆకారాన్ని తయారుచేసి ప్రతిష్టించారు. రాకెట్ నమూనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే వీటి ద్వారా జనాన్ని ఆకర్షించడంతోపాటు, వాహనదారులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ