Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ ఐ పవర్‌కు టెస్ట్.! ఈ ఫోటోలో ఉన్నది ఏ జంతువో చెప్పగలరా? కిర్రాక్ పజిల్..

'ఆప్టికల్ ఇల్యూషన్' చిత్రాలు ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఇంటర్నెట్‌లో మీ ఐక్యూ పెంచేందుకు లక్షల్లో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, నెంబర్ పజిల్స్, లెటర్ పజిల్స్ లాంటివి కోకొల్లలు. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేకంగా పేజీలు సైతం ఉన్నాయి. ఇలాంటి పజిల్స్‌ను నెటిజన్లు ఎప్పటికప్పుడు ఓ పట్టు పట్టేస్తుంటారు. కొందరైతే.. అందులోని రహస్యాన్ని కనిపెట్టేదాకా వదిలిపెట్టరు.

Viral Photo: మీ ఐ పవర్‌కు టెస్ట్.! ఈ ఫోటోలో ఉన్నది ఏ జంతువో చెప్పగలరా? కిర్రాక్ పజిల్..
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2023 | 6:41 PM

‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాలు ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఇంటర్నెట్‌లో మీ ఐక్యూ పెంచేందుకు లక్షల్లో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, నెంబర్ పజిల్స్, లెటర్ పజిల్స్ లాంటివి కోకొల్లలు. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేకంగా పేజీలు సైతం ఉన్నాయి. ఇలాంటి పజిల్స్‌ను నెటిజన్లు ఎప్పటికప్పుడు ఓ పట్టు పట్టేస్తుంటారు. కొందరైతే.. అందులోని రహస్యాన్ని కనిపెట్టేదాకా వదిలిపెట్టరు.

‘ఫైండ్ ది అబ్జెక్ట్’ ఫోటో పజిల్స్ ఎలప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇలాంటి పజిల్స్ మీ కళ్లకు పరీక్ష పెట్టడమే కాదు.. మెదడుకు కూసింత మేత కూడా వేస్తాయి. అసలు ఆ ఫోటోల్లో ఏమున్నాయ్.. ఒకవేళ ఉంటే..! అవి ఎక్కడున్నాయో కనిపెట్టేందుకు సవాల్ విసురుతాయ్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న వారు.. వీటిని ఓ పట్టు పట్టేస్తుంటారు. మేధావులు, ఎప్పుడూ ఏదొక పజిల్ సాల్వ్ చేసే వ్యక్తులైతే.. చిటికెలో ఆన్సర్ కనిపెట్టేస్తారు. మరికొందరైతే ఫెయిల్ అవుతుంటారు. మరి మీ పరిస్థితి ఏంటి.? మీకు ఫోటో పజిల్స్‌పై ఇంట్రెస్ట్ ఉంటే.. ఇదిగో ఈ ట్రిక్కీ పజిల్‌ను సాల్వ్ చేసేయండి..

పైన పేర్కొన్న ఫోటోలో ఉన్నది ఏ జంతువో చెప్పగలరా..? అది ఓ ఆలయంపై చెక్కిన శిల్పం. ఇక అందులో రెండు జంతువులు ఉన్నాయ్.. అవి ఏంటో మీరు చెప్పాలి.? కొంచెం తీక్షణంగా ఫోటోను చూస్తే.. ఈజీగా పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఈ ఫోటోను ఎలాంటి ఫోటోషాప్‌లోనూ క్రియేట్ చేయలేదు. ఎలాంటి మాయా లేదు.. మర్మం అంతకన్నా లేదు. ఇదొక పాత ఫోటో మళ్లీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ దీనిపై ఓ లుక్కేయండి. సమాధానం దొరక్కపోతే.. కింద ట్వీట్ చూడండి..

A 12th century optical illusion from Airavatesvara Temple in Tamil Nadu, India. What animal do you see? by u/EvaRaw666 in opticalillusions