AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆమె తెలివికి జోహర్లు.. KFC చికెన్‌తో పెయింట్ తయారీ.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత.. ఎంతో మంది క్రియేటివిటి బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఒక్కొక్కరూ తమలోని సృజనాత్మకతకు పదునుపెడుతూ.. ఆ వీడియోలను సామాజిక మాద్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. సాధారణంగా కొన్ని వ్యర్థాలను..

Viral Video: ఆమె తెలివికి జోహర్లు.. KFC చికెన్‌తో పెయింట్ తయారీ.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Kfc Chicken ( Representative Image )
Amarnadh Daneti
|

Updated on: Dec 11, 2022 | 4:00 PM

Share

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత.. ఎంతో మంది క్రియేటివిటి బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఒక్కొక్కరూ తమలోని సృజనాత్మకతకు పదునుపెడుతూ.. ఆ వీడియోలను సామాజిక మాద్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. సాధారణంగా కొన్ని వ్యర్థాలను పారవేయకుండా వాటిని ఉపయోగిస్తుంటాం. కోడిగుడ్డు పెంకులను మొక్కలకు వేయడం, ఉల్లిపాయ తొక్కలు, లేదా కూరగాయల వ్యర్థాలను కూడా చెట్లకు, మొక్కలకు వేయడం సాధారణంగా చూస్తుంటాం. ఇంకొంతమంది అయితే వ్యర్థాలతో కంపోస్టు కూడా తయారుచేస్తుంటారు. ఇటీవల ప్రభుత్వాలు కూడా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అయితే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం అన్నింటికంటే భిన్నమనే చెప్పుకోవచ్చు. చికెన్ తిన్న తర్వాత.. వాటి బోన్స్‌ని చాలా మంది పడేస్తారు. లేదంటే చుట్టుపక్కల పెంపుడు జంతువులకు వేస్తారు. ఇంతకీ మించి ఎంత ఆలోచించినా వాటితో ఏమి చెయవచ్చో అర్థంకాదు. కాని ఓ మహిళ మాత్రం KFC చికెన్ కొనుగోలు చేసి.. చికెన్ తినేసిన తర్వాత.. మిగిలిన బోన్స్‌తో పెయింట్ తయారుచేసింది. అదేంటి చికెన్‌ బోన్స్‌తో పెయింట్ తయారు చేయడం ఏమిటనుకుంటున్నారా.. ఇది నిజం. కొన్ని పదార్థాలను ఉపయోగించి ఓ మహిళ బ్లాక్ పెయింట్ తయారుచేసింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహిళకు ఎప్పటినుంచో పెయింటింగ్ చేసే అలవాటు ఉంది. బొమ్మలకు పెయింట్ చేస్తూ ఉంటుంది. అయితే మార్కెట్‌లో బ్లాక్‌ పెయింట్‌కు కొరత ఉండడంతో చికెన్‌ బోన్స్‌ని ఉపయోగించి సొంతంగా పెయింట్ తయారు చేయాలనుకుంది. KFC చికెన్‌ను తినేసిన తర్వాత మిగిలిన బోన్స్‌ను మాడే వరకు బొగ్గులా కాల్చివేసింది. ఆ మిశ్రమంలో కొంత నూనె వేసి కలుపుతుంది. అంతే బ్లాక్ పెయింట్ తయారవుతుంది. ఆ కలర్‌తో తన బొమ్మలకు పెయింట్ వేసింది ఆ మహిళ.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేసినప్పటి నుంచి లక్ష మందికి పైగా వీడియోను వీక్షించగా.. వేల మంది లైక్‌ చేశారు. నెటిజన్లు ఒక్కొక్కరూ ఒకో విధంగా ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఇదో అద్భుతమైన ప్రక్రియ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. వేయించిన మాంసం యొక్క ఎముకలను రీసైక్లింగ్ చేయడానికి ఇదో గొప్ప మార్గం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొన్ని వస్తువులను పడేయకుండా తిరిగి ఉపయోగించడం అత్యద్భుతం అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ