AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సాంప్రదాయ చీరకట్టులో జిమ్‌ వర్కవుట్స్‌ చేస్తున్న మహిళ.. వావ్‌ అంటూ నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు…

రీనా సింగ్ తన ఫిట్‌నెస్ రొటీన్‌ను చూపించే వీడియోలను షేర్ చేసింది. వెస్ట్రన్ వేర్‌లో కొన్ని ఫిట్‌నెస్ సెషన్‌లు కాకుండా, ఆమె చీరలో వర్కౌట్ చేస్తున్నట్టు అనేక వీడియోలు ఉన్నాయి.

Viral Video: సాంప్రదాయ చీరకట్టులో జిమ్‌ వర్కవుట్స్‌ చేస్తున్న మహిళ.. వావ్‌ అంటూ నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు...
Gymming
Jyothi Gadda
|

Updated on: Jan 09, 2023 | 9:05 PM

Share

సాధారణంగా జిమ్‌లకు వచ్చే వ్యక్తులు ప్రత్యేక డ్రెస్‌ కూడా వేసుకోవాలి. లేదంటే చాలా వరకు జిమ్‌ ట్రైనర్స్‌ అనుమతించరు. సరైన డ్రెస్సింగ్ లేకుండా జిమ్ పరికరాలపై వ్యాయామం చేయడం చాలా మందికి కష్టమవుతుంది. అయితే, అలాంటి ఆలోచనలన్నింటినీ తుంగలో తొక్కేసింది ఓ మహిళ. తననేవరూ అడ్డుకుని అన్నట్టుగా చీర ధరించి ఓ మహిళ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.. రీనా సింగ్‌ ఫిట్‌నెస్‌ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ మహిళ చీరలో హాయిగా వెయిట్‌లిఫ్టింగ్ వ్యాయామాలు, కొన్ని పుష్‌అప్‌లు చేయడం మనం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో మహిళ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని.. వినూత్నంగా చేసిన కరసత్తులు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రీనా సింగ్ తన ఫిట్‌నెస్ రొటీన్‌ను చూపించే వీడియోలను షేర్ చేసింది. వెస్ట్రన్ వేర్‌లో కొన్ని ఫిట్‌నెస్ సెషన్‌లు కాకుండా, ఆమె చీరలో వర్కౌట్ చేస్తున్నట్టు అనేక వీడియోలు ఉన్నాయి. రీనా ఇన్‌స్టాగ్రామ్‌లో (123K ఫాలోవర్స్), మోజ్ (మిలియన్‌కు పైగా ఫాలోవర్స్) అలాగే యూట్యూబ్‌లో (23.3K సబ్‌స్క్రైబర్స్) ఫాలోవర్లతో మంచి ఫేమ్‌ సంపాదించారు.

ఇవి కూడా చదవండి

చీరలో ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్‌గా మారింది. దీనికి 30K పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోకి ఇప్పటి వరకు దాదాపు 750K వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..