Watch Video: ఒక్కసారిగా కూలిపోయిన పార్కింగ్ గ్యారేజ్.. ధ్వంసమైన కార్లు

అమెరికాలోని మాన్‌హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రోజున ఓ భవనం వద్ద ఉన్న పార్కింక్ గ్యారెజ్ కూలిపోవంతో దానిపై ఉన్న కార్లన్ని ఒకదానికొకటి మీద పడిపోయాయి. పలు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

Watch Video: ఒక్కసారిగా కూలిపోయిన పార్కింగ్ గ్యారేజ్.. ధ్వంసమైన కార్లు
Parking Garage Coollapses
Follow us

|

Updated on: Apr 20, 2023 | 12:58 PM

అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రోజున ఓ భవనం వద్ద ఉన్న పార్కింక్ గ్యారెజ్ కూలిపోవంతో దానిపై ఉన్న కార్లన్ని ఒకదానికొకటి మీద పడిపోయాయి. పలు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ భవనం పూర్తిగా అస్థిరంగా ఉందని ఓ అధికారి తెలిపారు.

అయితే ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ మూడంతస్తుల భవనంలో ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఇంకా ఎవరైనా కార్లల్లో చిక్కుకున్నారా అని తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగాయని మరో అధికారి తెలిపారు. అయితే ఘటన జరిగిన ఆ భవనానికి దగ్గర్లో ఉన్న పేస్ యూనివర్శిటీలోని క్లాసులు రద్దు చేశారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి తరలించారు. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అనిపించిందని..పెద్ద శబ్దాలు వినిపించాయని ఆ విద్యార్థులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..