AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పెనిమిటి ఎంత కష్టం వచ్చింది..! అడిగింది కొనిస్తే సరిపోయేదిగా..

చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య జరిగే వాదనలు కొన్నిసార్లు గొడవల వరకూ చేరుకుంటాయి. అయితే కొంత కాలం క్రితం వరకూ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ జరిగినా చుట్టాలకు కాదు కదా.. ఇరుగు పోరుగుకి కూడా తెలియకూడదు అని భావించేవారు. అయితే ఇప్పుడు రోజులు మారాయి.. దీంతో ఇంటి గొడవలు వీధుల్లోకి వచ్చాయి. తాజాగా భార్యాభర్తలు రోడ్డు మధ్యలో గొడవ పడుతున్నారు, ఈ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

అయ్యో పెనిమిటి ఎంత కష్టం వచ్చింది..! అడిగింది కొనిస్తే సరిపోయేదిగా..
Woman Beats Husband
Surya Kala
|

Updated on: Sep 18, 2025 | 4:01 PM

Share

ఒకప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే అది గడప లోపలే ఉండేది. అయితే కాలం మారిపోయింది. ఇప్పుడు భార్యాభర్తల గొడవ వీధి మధ్యలోకి వచ్చేసింది. అవును దంపతుల మధ్య సమస్యలు పరిష్కారం కోసం వీధి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేసుకుని అందరికీ తెలిసేలా వీధి మధ్యలో గొడవ పడే జంటలు ఉన్నారు. ఈ వీడియో దీనికి నిదర్శనం. ఒక భార్య తన భర్తను వీధి మధ్యలో తీవ్రంగా కొడుతుండగా.. భర్త ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగినట్లు చెబుతున్నారు. ఈ గొడవ వెనుక కారణం తెలియరాలేదు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో భార్య భర్తను కొడుతున్న దృశ్యం వైరల్ అవుతోంది.

నడి రోడ్డు మీద గొడవ.. వినోదం చూస్తున్న ప్రజలు

@gharkekalesh అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ దృశ్యాన్ని చూడవచ్చు. భార్య తన భర్తను బ్యాంగిల్ షాపు బయట తీవ్రంగా కొట్టింది. మొదట కుర్చీపై కూర్చున్న తన భర్తను తన్ని, అతన్ని కింద పడేసింది. గొడవ తీవ్రమైంది. ఆపై ఆమె అతనిపైకి ఎక్కి తనకు ఓపిక ఉన్నంత వరకూ నచ్చినట్లు దంచి కొట్టింది. అంతటితో కూడా ఆగకుండా ఆమె అతని తలను కాలువలోకి తోసి మళ్ళీ కొట్టింది. దెబ్బల నుంచి తనను తాను విడిపించుకోవడానికి అతను ఎంత ప్రయత్నించినా.. అతని ప్రయత్నం ఫలించలేదు. అక్కడ ఉన్న వ్యక్తులు భార్యాభర్తల మధ్య గొడవలో జోక్యం చేసుకోలేదు. ఇద్దరినీ విడిపించడానికి ప్రయత్నించలేదు. ఈ సంఘటన జరుగుతుండగా.. కొంతమంది మొబైల్ కెమెరాలలో బంధించారు.

ఇవి కూడా చదవండి

ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.

సెప్టెంబర్ 17న షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ మహిళకు పోరాట నైపుణ్యం ఉందని ఒక వినియోగదారు సూచించారు. ఆమె ఖచ్చితంగా WWEలో చేరవచ్చు. ఆమె నిజంగా కఠినమైన పోటీదారు అని మరొక వినియోగదారు అన్నారు. భారతీయ జంటలు ఇలాగే ఉంటారు. అయితే ఇలా భార్యాభర్తల గొడవలు వీధుల్లోకి రావడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..