AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మా దోస్తుగాడినే పొడుస్తావానే.. కోడిపుంజును తరిమిన కుక్క.. అంతకుముందు ఏం జరిగిందో చూడండి..

ఈ డిజిటల్ యుగంలో ప్రతి నిత్యం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. అందులో యానిమల్స్ వీడియోలను జనాలు ఆసక్తిగా చూస్తారు. ఒక కోడి - ఒక బాలుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఇంకెందుకు ఆలస్యం చేసేయ్యండి..

Viral Video: మా దోస్తుగాడినే పొడుస్తావానే.. కోడిపుంజును తరిమిన కుక్క.. అంతకుముందు ఏం జరిగిందో చూడండి..
Dog Saves Boy From Aggressive Chicken
Krishna S
|

Updated on: Sep 18, 2025 | 3:41 PM

Share

సోషల్ మీడియాలో కొన్నిసార్లు వింత వీడియోలు కనిపిస్తాయి. అవి చూస్తే నవ్వు ఆగదు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక కోడి, 13 ఏళ్ల కుర్రాడిపై దాడి చేసి అతడిని భయపెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫన్నీ పోరాటం చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ కోడి పదేపదే ఆ కుర్రాడిపై దాడి చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో భయపడిని బాలుడు నేలపై పడిపోయి కోడిని తన్నడానికి ప్రయత్నించాడు. అయితే కోడి మాత్రం వెనక్కి తగ్గకుండా, అతడిపై మళ్లీ మళ్లీ దాడి చేస్తూనే ఉంది. దాంతో కుర్రాడు నిస్సహాయంగా ఉండిపోయాడు.

ఈ పోరాటం ఇలా కొనసాగుతుండగా.. ఒక కుక్క అనూహ్యంగా రంగంలోకి దిగింది. అది ఏ మాత్రం ఆలోచించకుండా, కోడిపై దాడి చేయడం మొదలుపెట్టింది. కుక్క వెంటపడటంతో కోడి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. దాంతో ఆ కుర్రాడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కుక్క ఆ బాలుడి పెంపుడు కుక్క అని తెలుస్తోంది.

ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో @NatureChapter అనే యూజర్‌ షేర్ చేశారు. 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటికే 2 లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని లైక్ చేసి,ఫన్నీ కామెంట్లు పెట్టారు. ఒక యూజర్ ఆ కోడి పిల్లవాడి కంటే ధైర్యంగా ఉంది అని కామెంట్ చేయగా.. మరొకరు “ఆ కుక్క రక్షించడానికి రాకపోతే ఈరోజు కోడి హీరో అయ్యేది’’ అని కామెంట్ చేశారు. కష్ట సమయంలో తన యజమానిని రక్షించిన ఆ కుక్కను చాలామంది ప్రశంసించారు. పెంపుడు జంతువులు తమ యజమానులకు ఎంత అండగా ఉంటాయో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్